ఏపీకి గుడ్ న్యూస్... మరో 100 ఎంబీబీఎస్ సీట్లు గ్రీన్ సిగ్నల్
Actor ProfilePolitician

ఏపీకి గుడ్ న్యూస్... మరో 100 ఎంబీబీఎస్ సీట్లు గ్రీన్ సిగ్నల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీకి గుడ్ న్యూస్... మరో 100 ఎంబీబీఎస్ సీట్లు గ్రీన్ సిగ్నల్
Zee Telugu25 Oct 2026
ఏపీకి గుడ్ న్యూస్... మరో 100 ఎంబీబీఎస్ సీట్లు గ్రీన్ సిగ్నల్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Andhra Pradesh MBBS Seats: ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది జాతీయ వైద్య కమిషన్. రాష్ట్రంలో మరో 100 ఎంబీబీఎస్ సీట్లకు పచ్చజెండా ఊపింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 100 కొత్త ఎంబిబిఎస్ సీట్లకు ఎన్‌ఎంసి అధికారికంగా ఆమోదం తెలిపింది. జాతీయ వైద్య కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా అనుమతి పత్రం అందిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ 100 ఎంబిబిఎస్ సీట్లలో, 75 కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు, 25 నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు కేటాయించారు. ఎన్‌ఎంసి నుంచి లభించిన ఈ కొత్త అనుమతితో, కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ సీట్ల సంఖ్య ప్రస్తుతమున్న 175 నుంచి 250కి పెరిగింది. అదేవిధంగా, ప్రస్తుతం 175గా ఉన్న నెల్లూరులోని ఎంబిబిఎస్ సీట్ల సంఖ్య 200కి పెరగనుంది. జాతీయ వైద్య మండలి నుంచి లభించిన ఈ ఆమోదం పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కృషి వల్లే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. సీట్ల సంఖ్యలో ఈ కొత్త పెరుగుదల రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు మరిన్ని అవకాశాలను కల్పిస్తుందని ఆయన తెలిపారు. వైద్య విద్యను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, అధ్యాపకుల నియామకం, ఎన్‌ఎంసి నిబంధనల అమలుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం వల్లే ఈ అనుమతులు లభించాయని వైద్య విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ. విష్ణువర్ధన్ తెలిపారు. ఈ అనుమతులు సాధించినందుకు కడప, నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలల