ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.2
Actor ProfilePolitician

ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.2

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.2,545 కోట్లు విడుదల
Samayam Telugu6 Oct 2026
ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.2,545 కోట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వీబీ జీరామ్‌జీ పథకం కింద తొలివిడతగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,545 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధులలో ఉపాధి హామీ కూలీల వేతనాల కోసం రూ.1,414 కోట్లు వెచ్చించనున్నారు. అలాగే పథకానికి కావాల్సిన మెటీరియల్‌ కోసం రూ.942.77 కోట్లు కేటాయించారు. ఇక పరిపాలనా వ్యయం కోసం ఇందులో రూ.188.50 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. వీబీ జీరామ్‌జీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు సమర్థవంతంగా వినియోగించుకోనున్నట్లు మంత్రి తెలిపారు. తొలివిడత నిధుల ద్వారా గ్రామీణ ప్రాంతాలలలో ఉపాధి అవకాశాలను విస్తరిస్తామని.. మౌలిక వసతుల అభివృద్ధి. శాశ్వత ఆస్తుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు చెప్పారు. ఉపాధి కల్పన, స్థిరమైన జీవనోపాధి, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యం దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో నిలుస్తుందనే ఆశాభావాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యక్తం చేశారు. మరోవైపు వీబీ జీరామ్‌జీ పథకాన్ని తిరుపతి నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే.మరోవైపు ఏపీలోని ఉపాధి హామీ కూలీలకు వేతనాలు పెరిగాయి. ఉపాధి హామీ శ్రామికులకు రోజువారీ వేతనం రూ.5 పెంచారు. దీంతో వేతనం రూ.312కు పెరిగింది. తెలంగాణలో ఉపాధి కూలీలకు అందించే రోజువారీ వేతనం రూ.308 చొప్పున అందిస్తారు. జులై 1 నుంచి ఉపాధి కూలీలకు ఈ పెరిగిన వేతనాలు అమల్లోకి వచ్చాయి. మరోవైపు 21 రాష్ట్రాల్లో ఉపాధి హామీ కూలీల కనీస వేతనం రూ.300లుగా ఉంది. ఈ పథకం కింద దేశంలోనే అత్యధికంగా సిక్కింలోని మూడు పంచాయతీల్లో రూ.450 వేతనం చెల్లిస్తున్నారు. కేరళలో రూ.401, కర్ణాటకలో రూ.382కు చొప్పున ఉంది. గోవాలో రూ.406, పుదుచ్చేరి రూ.347, హిమాచల్‌ప్రదేశ్‌లో రూ.375గా ఉపాధి హామీ కూలీల వేతనం ఉంది.మరోవైపు జాతీయ గ్రామీణ ఉపాధి