ఏనుగుదంతాల వివాదం.. మోహన్ లాల్ వద్ద ఉన్న వాటికి డీఎన్ఏ టెస్ట్
Actor ProfileActor

ఏనుగుదంతాల వివాదం.. మోహన్ లాల్ వద్ద ఉన్న వాటికి డీఎన్ఏ టెస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏనుగుదంతాల వివాదం.. మోహన్ లాల్ వద్ద ఉన్న వాటికి డీఎన్ఏ టెస్ట్
Eenadu26 Sept 2026
ఏనుగుదంతాల వివాదం.. మోహన్ లాల్ వద్ద ఉన్న వాటికి డీఎన్ఏ టెస్ట్

ఇంటర్నెట్‌ డెస్క్: అగ్రకథానాయకుడు మోహన్‌ లాల్‌ (Mohanlal) ఏనుగు దంతాల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. వన్యప్రాణుల కొమ్ములు, దంతాలతో తయారుచేసిన వస్తువులను అక్రమంగా కలిగి ఉన్నారనే కేసులో ఆయన ఇప్పటికే విచారణ ఎదుర్కొంటుండగా, తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన వద్ద ఉన్న విగ్రహాలకు అటవీ శాఖ డీఎన్ఏ (DNA) పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గతంలో తన వద్ద నాలుగు ఏనుగు దంతాలు ఉన్నాయని ప్రకటించిన మోహన్‌లాల్‌, ఇప్పుడు మరో ఆరు దంతాలు ఉన్నట్లు వెల్లడించాడు. ఏనుగు దంతాలతో చేసిన 13 విగ్రహాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కేరళ అటవీ శాఖ ఇచ్చిన క్షమాభిక్ష పథకంలో భాగంగా నటుడు తాజా ప్రకటన చేశారు. తన వద్ద ఉన్న ఈ దంతాలు, విగ్రహాలలో చాలా వరకు తనకు వారసత్వంగా వచ్చినవి, బహుమతులుగా లభించినవేనని మోహన్‌లాల్ స్పష్టం చేశారు. కాగా.. ఆయన ప్రకటించిన ఏనుగు దంతాల విగ్రహాలలో కృష్ణుడు, రాముడు, బాలాజీ రూపాలు ఉన్నాయని, వాటి మొత్తం బరువు సుమారు 46 కిలోలు ఉంటుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. రెండున్నరేళ్ల విరామం తర్వాత ‘లెనిన్‌’తో పలకరించనున్నారు అఖిల్‌. అఖిల్‌ హీరోగా నాగార్జున నిర్మించిన చిత్రం ‘లెనిన్‌’. జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది