ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే
Actor ProfileActor

ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే
Chitrajyothy21 Nov 2026
ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే

సాధారణంగా స్టార్ హీరోల పుట్టినరోజు అంటే వారం రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో సందడి మొదలవుతుంది. హీరో నటిస్తున్న తాజా చిత్రాల నుంచి టీజర్లు, గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్లు వస్తాయని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. సాధారణంగా స్టార్ హీరోల పుట్టినరోజు అంటే వారం రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో సందడి మొదలవుతుంది. హీరో నటిస్తున్న తాజా చిత్రాల నుంచి టీజర్లు, గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్లు వస్తాయని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి (Varanasi) పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, మహేష్ పుట్టినరోజున రాజమౌళి ఏదో ఒక సంచలన అప్‌డేట్ ఇస్తారని ఫ్యాన్స్ గంపెడాశతో ఉన్నారు. కానీ, ఆ ఆశల మీద రాజమౌళి నీళ్ళు చల్లాడు. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి టీమ్ వారణాసి నుంచి ఎటువంటి టీజర్ లేదా గ్లింప్స్‌ను విడుదల చేయలేదు. కేవలం ఆఫ్రికా షెడ్యూల్‌లో చిత్రీకరించిన రెండు కొత్త స్టిల్స్‌ను మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేసి రుద్ర పాత్రను పరిచయం చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోల్లో మహేష్ బాబు రగ్గడ్ లుక్‌లో, ఆఫ్రికా అడవుల నేపథ్యంలో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ పరిణామంపై అభిమానులు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏదో అద్భుతమైన టీజర్ వస్తుందని ఆశించాం, కానీ కేవలం సెట్ ఫొటోలతో సరిపెట్టారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం రాజమౌళి మార్క్ అంటేనే గోప్యత, సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా రావాలంటే ఇలాంటి జాగ్రత్తలు అవసరమే అని సమర్థిస్తున్నారు. ప్రస్తుతం వారణాసి షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న