
విశాఖపట్నం డేటా సెంటర్లపై అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. డేటా సెంటర్ల నీటి వినియోగంపై దుష్ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం డేటా సెంటర్లపై అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. డేటా సెంటర్ల నీటి వినియోగంపై దుష్ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత డిజిటల్ ఎకానమీకి డేటా సెంటర్లు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. గూగుల్ పెట్టుబడితో విశాఖపై ఇతర ఐటీ కంపెనీలకు ఆసక్తి పెరిగిందని వ్యాఖ్యానించారు. డేటా సెంటర్ల ఎకోసిస్టమ్ 6.5 GWకు చేరితే ఏడాదికి సుమారు 3 టీఎంసీల నీరు అవసరమని వెల్లడించారు. కొత్త కూలింగ్ టెక్నాలజీలతో డేటా సెంటర్ల నీటి వినియోగం మరింత తగ్గుతుందని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు. డేటా సెంటర్లకు పోలవరం నీటిలో పారిశ్రామిక కేటాయింపుల నుంచే నీరు వస్తోందని వివరించారు. విశాఖ నగర ప్రజల నీటి అవసరాలకు కేటాయించిన నీటిని డేటా సెంటర్లకు మళ్లించమని స్పష్టం చేశారు. పోలవరం నుంచి విశాఖపట్నం నగరానికి గ్రావిటీ ద్వారా నీటి సరఫరాను 18 నెలల్లో అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు. డేటా సెంటర్ల కోసం ప్రత్యేక పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. 1 GW థర్మల్ పవర్ ప్లాంట్‌తో పోలిస్తే డేటా సెంటర్‌కు దాదాపు పదో వంతు నీరే అవసరమని వెల్లడించారు. థర్మల్ పవర్ ప్లాంట్ల నీటి వినియోగంపై కాకుండా డేటా సెంటర్లపైనే ఎందుకు నిరసనలు? చేస్తున్నారని మంత్రి లోకేశ్ ప్రశ్నించారు. డేటా సెంటర్ కేటాయింపులకు 6.5 GW పరిమితి విధించినట్లు సీఎం చంద్రబాబు చెప్పారని అన్నారు. 6.5 GW డేటా సెంటర్ కేటాయింపుల లక్ష్యం ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చే కంపెనీలకే తమ ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తుందని స్పష్టం