ఏ స్వాతంత్ర పోరాటంలో పాల్గొంది ? అమరుల పేర్లు చెప్పాలని ప్రియాంక్ ఖర్గే సవాల్
Actor ProfilePolitician

ఏ స్వాతంత్ర పోరాటంలో పాల్గొంది ? అమరుల పేర్లు చెప్పాలని ప్రియాంక్ ఖర్గే సవాల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏ స్వాతంత్ర పోరాటంలో పాల్గొంది ? అమరుల పేర్లు చెప్పాలని ప్రియాంక్ ఖర్గే సవాల్
Oneindia Telugu25 Dec 2026
ఏ స్వాతంత్ర పోరాటంలో పాల్గొంది ? అమరుల పేర్లు చెప్పాలని ప్రియాంక్ ఖర్గే సవాల్

కర్నాటకలో ఆరెస్సెస్ (RSS) టార్గెట్ గా ప్రభుత్వ, బహిరంగ ప్రదేశాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అసెంబ్లీలో బిల్లు తెస్తున్న డీకే శివకుమార్ సర్కార్.. అంతకు ముందే ఆ సంస్థపై మాటల దాడి మొదలుపెట్టింది. ఇప్పటికే ఆరెస్సెస్ కు రిజిస్ట్రేషన్ లేకపోవడాన్ని పదే పదే ప్రశ్నిస్తున్న హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే.. ఇవాళ ఆ సంస్థ ఏ స్వాతంత్ర పోరాటంలో పాల్గొందంటూ సూటి ప్రశ్న వేశారు. అలాగే ఆరెస్సెస్ తరఫున స్వాతంత్ర పోరాటంలో ఎంత మంది అమరులయ్యారో చెప్పాలని సవాల్ విసిరారు.మల్లిఖార్జున ఖర్గే సభా స్ధలి శుద్ధీకరణ-కాంగ్రెస్ బాస్ కు అవమానం..! ఇరుకునపడ్డ బీజేపీ..!స్వాతంత్ర పోరాటంలో అమరులైన 500 మంది కాంగ్రెస్ నాయకుల జాబితాను తాను ఇస్తానని, కనీసం అలాంటి 50 మంది పేర్లను అయినా ఆరెస్సెస్ బయటపెట్టాలంటూ కర్నాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) సవాల్ విసిరారు. దేశవిభజన తర్వాత మత ఉద్రిక్తతలకు ఆర్‌ఎస్‌ఎస్ కారణమైందని, అల్లర్ల సమయంలో ప్రజలను రక్షించడంలో ఆ సంస్థ ఏ పాత్ర పోషించిందని ఖర్గే ప్రశ్నించారు. ఆరెస్సెస్ రిజిస్టర్ కాని సంస్ద కావడం వల్ల నిషేధం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాంగణాలు, ప్రజా ఆస్తులను సంస్థలు ఉపయోగించుకోవడాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టంపై కర్ణాటకలో జరుగుతున్న మరో రాజకీయ పోరు నేపథ్యంలో ప్రియాంక్ ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. నల్సార్ కు బార్ కౌన్సిల్ సారీ చెప్పాల్సిందే..! సీజేఐకి మరో లా యూనివర్శిటీ షాక్..!ఈ చట్టం, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే ఆర్‌ఎస్‌ఎస్ శాఖల వంటి కార్యకలాపాలపై ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం సంస్థలు అధికారికంగా రిజిస్టర్ అయి ఉన్నాయా లేదా అనే దానితో సంబంధం లేకుండా, ప్రజా ఆస్తులు లేదా ప్రభుత్వ ప్రాంగణాల్లో కార్యక్రమాలు నిర్వహించే ముందు సంబంధిత అధికార సంస్థ నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టంలోని నిబంధనలను పరిశీలించకముందే బీజేపీ దీనిని ఎందుకు వ్యతిరేకిస్తోందని ఖర్గే ప్రశ్నించారు.