
నంద్యాల జిల్లాలో దశాబ్దాలుగా నలుగుతున్న క్లిష్టమైన భూ సమస్యకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పర్యటనలోనే తక్షణ పరిష్కారం చూపారు. బేతంచర్ల మండలం గుటుపల్లి గ్రామానికి చెందిన 897 మంది రైతుల 2,074 ఎకరాల భూములను నిషేధిత 22ఏ జాబితా నుంచి విముక్తి కల్పించారు. కేవలం హామీ ఇవ్వడమే కాకుండా, బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయంలోనే అధికారుల సమక్షంలో మొత్తం ప్రక్రియను దగ్గరుండి పూర్తి చేయించి, రైతులకు విముక్తి పత్రాలను అందజేశారు. గురువారం నంద్యాల జిల్లాలో పర్యటించిన సీఎం, ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.అక్కడికక్కడే పరిష్కారం ఈ ఏడాది మార్చి 9న డోన్ పర్యటనలో గుటుపల్లి రైతులు తమ భూములను గత ప్రభుత్వం అన్యాయంగా 22ఏ జాబితాలో చేర్చిందని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చారు. ఆ వినతిని గుర్తుంచుకున్న ముఖ్యమంత్రి, గురువారం బనగానపల్లె పర్యటనలో ఆ రైతులను ప్రత్యేకంగా తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించారు. సమస్య పరిష్కారానికి రాష్ట్రస్థాయిలో చర్యలు పూర్తయ్యాయని, జిల్లా స్థాయిలో ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని జిల్లా రిజిస్ట్రార్‌ను ప్రశ్నించారు. కలెక్టర్ నుంచి అధికారిక ఉత్తర్వులు అందనందున ఆన్‌లైన్ ప్రక్రియ మొదలు కాలేదని రిజిస్ట్రార్ చెప్పడంతో, సీఎం అక్కడికక్కడే కలెక్టర్‌తో మాట్లాడి ఉత్తర్వులను రిజిస్ట్రార్‌కు అందజేశారు. "త్వరలోనే పూర్తి చేస్తాం" అని అధికారి చెప్పగా, "త్వరలో కాదు, ఇప్పుడే పూర్తి చేయండి" అని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి, గుటుపల్లికి చెందిన 2,074 ఎకరాలను 22ఏ జాబితా