ఏంటి మేడమ్ ఇలా మారిపోయారు? మహారాణి గెటప్ లో జబర్దస్త్ కమెడియన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా
Actor ProfileCelebrity

ఏంటి మేడమ్ ఇలా మారిపోయారు? మహారాణి గెటప్ లో జబర్దస్త్ కమెడియన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏంటి మేడమ్ ఇలా మారిపోయారు? మహారాణి గెటప్ లో జబర్దస్త్ కమెడియన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా
TV9 Telugu24 Oct 2026
ఏంటి మేడమ్ ఇలా మారిపోయారు? మహారాణి గెటప్ లో జబర్దస్త్ కమెడియన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా

పై ఫొటోల్లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? టీవీ షోస్ అందులోనూ జబర్దస్త్ షో చేసే వారు ఈ ముద్దుగుమ్మను ఈజీగా గుర్తు పట్టేసి ఉంటారు. మహారాణి గెటప్ లో మెరిసోతోన్న ఆ బ్యూటీ మరెవరో కాదు జబర్దస్త్ సత్యశ్రీ. జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్లలో సత్య శ్రీ ఒకరు. ఈ వేదికపై చమ్మక్ చంద్రతో కలిసి ఆమె చేసిన స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. యూట్యూబ్ లో కూడా వీరి స్కిట్స్ కు భారీగా వ్యూస్ వచ్చాయి. అయితే చమ్మక్ చంద్ర జబర్దస్త్ వీడిన కొద్ది రోజులకే సత్య శ్రీ కూడా ఈ షోను వదిలేసింది. ఆ తర్వాత వేరే ఛానల్స్ టీవీ షోల్లోనూ సందడి చేసింది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బుల్లితెరకు పూర్తిగా దూరంగా ఉంటోంది. ప్రస్తుతం వెండితెరపై సత్తా చాటుతోన్న సత్యశ్రీ చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన అనగనగా ఒక రాజు సినిమాలో సత్యశ్రీ కూడా ఒక కీలక పాత్ర పోషించింది. ఇక రీసెంట్ గా వెంకట్రామయ్య గారి మనవరాలు సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించింది సత్యశ్రీ. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ ఈ మూవీలో మెయిన్ లీడ్ చేస్తోంది. సినిమాలు, టీవీషోలతో బిజీగా ఉండే సత్యశ్రీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అలా తాజాగా ఆమె ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఆసక్తికరమైన ఫొటోలు షేర్ చేసింది. అందులో ఆమె మహారాణి గెటప్ లో చాలా అందంగా కనిపించింది