ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు.. ఈ లిమిట్ దాటితే మోతే
Actor ProfilePolitician

ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు.. ఈ లిమిట్ దాటితే మోతే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు.. ఈ లిమిట్ దాటితే మోతే
Samayam Telugu15 Jan 2027
ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు.. ఈ లిమిట్ దాటితే మోతే

SBI Basic Savings Bank Deposit Account: భారతదేశంలోనే అతిపెద్దదైన ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) అకౌంట్లకు సంబంధించి సర్వీస్ ఛార్జీల్ని సవరించింది. బ్యాంక్ బ్రాంచ్‌లు, ఏటీఎంల ద్వారా కలిపి నగదు విత్‌డ్రాలకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. 2026, అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఇక మీదట ప్రతి నెలలో 4 ఉచిత నగదు విత్‌డ్రా (బ్యాంకులు, ఏటీఎంలు) లావాదేవీలకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఈ పరిమితి దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్‌పై రూ. 15 ఛార్జ్ ప్లస్ జీఎస్టీ విధిస్తామని వెల్లడించింది.అయితే అంతకుముందు కూడా 4 ఉచిత లావాదేవీల తర్వాత రూ. 15 ఛార్జ్ ఉన్నప్పటికీ, అప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ దీని పరిధిలోకి రాలేదు. ఇప్పుడు ఆ మినహాయింపు లేదు. మునుపటిలా కాకుండా డిజిటల్ లావాదేవీలను కూడా ఇప్పుడు ఈ ఉచిత లావాదేవీల పరిమితిలోనే చూస్తారు. అంటే బ్రాంచ్, ఏటీఎం, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కలిపి ఉచిత క్యాష్ విత్‌డ్రా పరిమితి 4 లావాదేవీలకు మాత్రమే అవకాశం ఉంటుంది.బేసిక్ సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటి?ఈ ప్రాథమిక పొదుపు ఖాతాలు (బేసిక్ సేవింగ్స్ అకౌంట్) అనేవి సాధారణంగా సమాజంలో పేద వర్గాల కోసం ఉద్దేశించినవి. ఎలాంటి అదనపు ఫీజులు, ఛార్జీల భారం లేకుండా వారికి పొదుపును ప్రారంభించేలా ప్రోత్సహించడమే దీని ఉద్దేశం. ఈ బేసిక్ సేవింగ్స్ అకౌంట్ కింద ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటెయన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎలాంటి ఛార్జీలు పడవు. చెక్ బుక్ ఫెసిలిటీ ఉండదు. బ్యాంక్ బ్రాంచులు లేదా ఏటీఎంల ద్వారా మాత్రమే నగదు విత్‌డ్రాకు ఛాన్స్ ఉంటుంది. బేసిక్ రూపే ఏటీఎం- కమ్- డెబిట్ కార్డును అకౌంట్ హోల్డర్‌కు ఇస్తారు. నెలకు నాలుగు ఉచిత క్యాష్