ఎస్.జానకి తెలుగు గడ్డ
Actor ProfilePolitician

ఎస్.జానకి తెలుగు గడ్డ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎస్.జానకి తెలుగు గడ్డపై జన్మించడం మనందరికీ గర్వకారణం
AP7AM29 Oct 2026
ఎస్.జానకి తెలుగు గడ్డపై జన్మించడం మనందరికీ గర్వకారణం

ప్రముఖ గాయని, దక్షిణ భారత గానకోకిల ఎస్. జానకి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం భారతీయ సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటనలో తన ప్రగాఢ సంతాపం తెలిపారు."దక్షిణ భారత గానకోకిలగా ప్రసిద్ధి పొందిన ఎస్. జానకి గారు 48 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తన మధురమైన గాత్రంతో దశాబ్దాల పాటు కోట్లాది మందిని అలరించారు" అని లోకేశ్ కొనియాడారు. భారతీయ సినీ సంగీత చరిత్రలో ఆమె స్థానం చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.ఎస్. జానకి తెలుగు నేలపై జన్మించడం మనందరికీ గర్వకారణమని లోకేశ్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు మంత్రి లోకేశ్ వివరించారు