ప్రేమకు మనన్సు తప్ప ఏదీ చూడదని మరోసారి నిరూపించారు ఈ జంట. ఆ ఇద్దరిది ఒక ప్రాంతం కాదు, ఒక రాష్ట్రం కాదు.. ఒక దేశం కూడా కాదు. కానీ, ఆ ఇద్దరి మనస్సులు కలిశాయి. అలా అనీ ఎక్కడో ఒక చోటు పెళ్లి చేసుకుని ఉండిపోలేదు. తల్లిదండ్రులను ఒప్పించుకున్నారు. వారి మతాచారంలోనే సంప్రదాయంగా వివాహం చేసుకున్నారు. ఎల్లలు దాటిని వీరి ప్రేమగాథ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.తణుకు ప్రాంతానికి చెందిన సిర్రా బ్రహ్మయ్య కుమారుడు జానకి రామ్ పాల్ నాలుగేళ్ల కిందట రష్యా వెళ్లాడు. అక్కడ బైబిల్ కోర్సులో శిక్షణ పొందాడు. ఆ సమయంలోనే రష్యాలో డానిలోవా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా, స్నేహం కాస్తా ప్రేమగా మారింది. దాంతో వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.READ ALSO ఏడో నెలలోనే పుట్టిన బిడ్డ.. ప్రాణమే లేకుండా శిశువు.. దేవుడిలా 108 సిబ్బందిడానిలోవా ముందుగా తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. తాను భారతదేశానికి చెందిన వ్యక్తిని ప్రేమించానని, వివాహం చేసుకుంటానని చెప్పింది. దాంతో ఆమె తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించి పెళ్లికి అంగీకరించారు. జానకిరామ్ పాల్ కూడా తణుకులోని తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే వివాహానికి అంగీకరించారు.అయితే, వివాహం భారతదేశంలో జరుగుతుండటంతో అమ్మాయి తల్లిదండ్రులు కూడా దీనికి అంగీకరించారు. రష్యా దేశం నుంచి డానిలోవా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తణుకుకు వచ్చారు. తణుకులోని స్థానిక వీకే ఫంక్షన్ హాలులో వీరి వివాహం జరిగింది. క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది.ఈ వివాహం అందర్నీ ఆకట్టుకుంది. రష్యా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అని తెలియడంతో ఈ వివాహం చూసేందుకు చాలా మంది వచ్చారు. జంటను చూసిన అందరూ మెచ్చుకున్నారు. ఈ వివాహ కార్యక్రమానికి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దేశాంతరాలు దాటి వివాహాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఎంతోమంది
Actor ProfilePolitician
ఎల్లలు దాటిన ప్రేమ.. తణుకు అబ్బాయి
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•19 Nov 2026
ఎల్లలు దాటిన ప్రేమ.. తణుకు అబ్బాయి, రష్యా అమ్మాయి.. ఆంధ్రాలో పెళ్లి