
ఇరుగుపొరుగు రాష్ట్రాలతో ఏళ్లుగా సాగుతున్న నీటి వివాదాలు మళ్లీ అగ్గి రాజేసాయి. తమ హక్కుల సాధన కోసం కన్నడ ఉద్యమకారులు సమరశంఖం పూరించారు. వచ్చే ఆగస్టు 13న కర్ణాటక వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన మాతృభాషా సంఘాలు, దానికి ముందస్తు హెచ్చరికగా సరిహద్దుల్లో రాకపోకలను స్తంభించిపోయేలా చేశాయి. మేకదాటు, మహదాయి, కళసా బండూరి వంటి కీలక సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం హింసాత్మక రూపు దాల్చేలా కనిపిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవాంతరాలను ఎదుర్కొంటున్నారు.మహా బంద్‌కు సమరభేరి మోగిస్తూ కన్నడ చలవళి నేత వాటాల్ నాగరాజ్ నేతృత్వంలో సోమవారం ఉదయం నుంచే నిరసనలు ఉధృతమయ్యాయి. కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లోని అత్యంత బిజీ రహదారి అయిన అట్టిబెల్లె చెక్‌పోస్ట్ వద్ద ఉద్యమకారులు బైఠాయించారు. దీంతో తమిళనాడు నుంచి కర్ణాటకలోకి, అలాగే బెంగళూరు వైపు నుంచి తమిళనాడు వైపు వెళ్లే వేలాది లారీలు, బస్సులు, ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సరిహద్దుల్లో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మందుబాబులకు బిగ్ షాక్ - రెండు రోజులు మద్యం అమ్మకాలు బంద్..!!3,000 సంఘాల మద్దతు: బంద్‌కు సర్వం సిద్ధంగురువారం కర్ణాటకను పూర్తిగా స్తంభింపజేస్తామని వాటాల్ నాగరాజ్ స్పష్టం చేశారు. ఇప్పటికే దాదాపు 2,000కు పైగా కన్నడ అనుకూల, రైతు సంఘాలు ఈ బంద్‌కు మద్దతు తెలిపాయని, ఆ సంఖ్య 3,000 మార్కును చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బెంగళూరు, మైసూర్ నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా రంగాలు తమ వ్యాపారాలను బంద్ చేసి పోరాటానికి సహకరించాలని కోరారు. ప్రభుత్వం మేకదాటు ప్రాజెక్టుపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.పెరిగిన పాల ధరలు... పొరుగు రాష్ట్రంలో డెయిరీల షాక్!ముఖ్యమంత్రి విజ్ఞప్తి నిరాకరణ.. ఏవి తెరిచి ఉంటాయి? ఏవి మూతపడతాయి?పరిస్థితి చేయిదాటకుండా చూసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బంద్