ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం ఒక్కసారిగా కుదుపులకు గురై 300 అడుగుల కిందకు పడిపోయి ప్రయాణికులు గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ విమానం నడిపిన పైలట్‌కు రెండోసారి డోప్ పరీక్షల్లోనూ పాజిటివ్ వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విమానం ఢిల్లీలో సురక్షితంగా దిగిన తర్వాత విమాన ప్రమాద పరిశోధన బ్యూరో (AAIB) నియమాల ప్రకారం పైలట్లకు సైకోయాక్టివ్ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. పౌర విమానయాన శాఖ నిబంధనల ప్రకారం పైలట్లు, సిబ్బందికి ఎప్పటికప్పుడు డోప్ టెస్టులు నిర్వహిస్తుంటారు.ప్రాథమిక పరీక్షతో పాటు తదుపరి ల్యాబ్ కన్ఫర్మేటరీ పరీక్షలోనూ ప్రధాన పైలట్ గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. కో-పైలట్ పరీక్ష ఫలితం నెగెటివ్‌గా వచ్చింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తు పూర్తయ్యే వరకు సదరు పైలట్లను ఎయిరిండియా విధుల నుంచి తప్పించింది. 137 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బందితో ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఏఐ-2379 విమానం.. గాల్లోనే కుదుపులకు గురై, అకస్మాత్తుగా 300 అడుగుల ఎత్తును కోల్పోయింది. ఈ ఘటనలో కనీసం 13 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు సిబ్బందికి టెయిల్ బోన్, వెన్నెముకకు గాయాలైనట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.ఢిల్లీలో విమానం దిగిన తర్వాత నిర్వహించిన స్క్రీనింగ్‌లో పైలట్ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని వర్గాలు తెలిపాయి. కొంతసేపటి తర్వాత మరో పరీక్ష నిర్వహించగా, అది కూడా పాజిటివ్‌గా తేలిందని మంగళవారం వెల్లడించాయి. ప్రత్యేకంగా పైలట్ గంజాయి సేవించినట్లు పరీక్షలో నిర్ధారణ అయింది. జరిగిన సంఘటనల క్రమాన్ని వివరిస్తూ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. పైలట్ చర్య, సాంకేతిక లోపం లేదా హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా విమానం 300 అడుగుల మేర వేగంగా కిందకు పడిపోయి 'నెగటివ్-జి' పరిస్థితిలోకి వెళ్లినప్పుడు, పైలట్ తన సీటులో లేడు, కో-పైలట్ ఎయిర్‌బస్ A320నియోన్ విమానాన్ని నడుపుతున్నాడు
Samayam Telugu•5 Dec 2026
ఎయిరిండియా విమానం పైలట్ కు రెండోసారి డోప్ టెస్ట్ లోనూ పాజిటివ్.. గంజాయి తాగి నడిపాడా
Eenadu•5 Dec 2026
ఎయిరిండియా పైలట్ కు డ్రగ్ టెస్ట్ .. గంజాయి తీసుకున్నట్లు నిర్ధరణAir India | దిల్లీ: ఎయిరిండియా విమానం తీవ్రమైన కుదుపులకు గురైన ఘటన అనంతరం నిర్వహించిన డోప్ టెస్టులో పైలట్ విఫలమయ్యాడు. పైలట్ గంజాయి సేవించినట్లు డ్రగ్ టెస్టులో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి