ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Actor ProfilePolitician

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

📊 Box Office Collections
Total News5
Movie Updates0
Sources5
కడియం శ్రీహరిపై రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన కొండా సురేఖ
AP7AM6 Oct 2026
కడియం శ్రీహరిపై రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన కొండా సురేఖ

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతోంది. కడియం శ్రీహరిపై ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై హైకమాండ్ కు మంత్రి సురేఖ ఫిర్యాదు
SkyC Media4 Oct 2026
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై హైకమాండ్ కు మంత్రి సురేఖ ఫిర్యాదు

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల మధ్య దీర్ఘకాలిక విభేదాలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ తన నియోజకవర్గ పరిధిని మించి జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశం కేంద్రంగా ఈ వివాదం ఇప్పుడు పూర్తిగా వెలుగులోకి వచ్చింది. కొండా సురేఖ మరియు కడియం శ్రీహరి మధ్య ఈ అంతర్గత విభేదాలు ఈనాటివి కావు, గత కొన్ని నెలలుగా కొనసాగుతున్నాయి. జిల్లా అభివృద్ధి, నియోజకవర్గ పెత్తనం, అధికారుల నియామకాలు వంటి పలు అంశాలపై ఇద్దరి మధ్య తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కొంతకాలం వీరి మధ్య సయోధ్య కొనసాగినా, తాజా సమీక్ష సమావేశం ఆ సయోధ్యకు పూర్తిగా బ్రేక్ వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల కడియం శ్రీహరి తన నియోజకవర్గ సమస్యలపై దేవాదాయ శాఖ అధికారులతో ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ చర్యపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన అసంతృప్తిని బయటపెట్టారు. ఇదిలా ఉండగా మంత్రి సమాచారం లేకుండా, ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తూ జిల్లా స్థాయి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఎంతవరకు సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న కొండా సురేఖ, కడియం శ్రీహరి వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫలితంగా ఆమె అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పెద్దలకు మరియు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి లేఖలు రాసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ విషయంపై ప్రత్యేకంగా ఆరా తీసినట్లు సమాచారం అందింది

కడియం శ్రీహరి పై హైకమాండ్ కు కొండా సురేఖ ఫిర్యాదు
Oneindia Telugu4 Oct 2026
కడియం శ్రీహరి పై హైకమాండ్ కు కొండా సురేఖ ఫిర్యాదు

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరంగల్ కేంద్రంగా హోరా హోరీ రాజకీయం కొనసాగుతోంది. నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. తాజాగా కేబినెట్ సమావేశానికి దూరంగా ఉండటంతో

వరంగల్ కాంగ్రెస్ లో మళ్లీ లొల్లి.. తగ్గేదేలే అంటున్న కొండా సురేఖ.. ఎమ్మెల్యే కడియం తీరుపై హైకమాండ్ కు
10TV Telugu3 Oct 2026
వరంగల్ కాంగ్రెస్ లో మళ్లీ లొల్లి.. తగ్గేదేలే అంటున్న కొండా సురేఖ.. ఎమ్మెల్యే కడియం తీరుపై హైకమాండ్ కు

కడియంపై కొండా సురేఖ ఫిర్యాదు వరంగల్ కాంగ్రెస్‌లో పెరిగిన వివాదం అధికారుల రివ్యూతో రేగిన లొల్లి Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ నేతలు, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే

కొండా సురేఖ-కడియం శ్రీహరి మధ్య ముదుతున్న వివాదం
Andhra Jyothy3 Oct 2026
కొండా సురేఖ-కడియం శ్రీహరి మధ్య ముదుతున్న వివాదం

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు