ఎన్టీఆర్ హయాంలోని రాజకీయాలు మళ్లీ రావాలి
Actor ProfilePolitician

ఎన్టీఆర్ హయాంలోని రాజకీయాలు మళ్లీ రావాలి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎన్టీఆర్ హయాంలోని రాజకీయాలు మళ్లీ రావాలి
TeluguOne16 Dec 2026
ఎన్టీఆర్ హయాంలోని రాజకీయాలు మళ్లీ రావాలి

రాజకీయాలు వ్యాపారంగా మారాయి.. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి సభాపతి పిలుపు..! దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు హయాంలో ఉన్న రాజకీయ విలువలు, క్రమశిక్షణ ప్రస్తుత రోజుల్లో మళ్లీ పునరావృతం కావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన, సీనియర్ రాజకీయ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థానాన్ని ప్రజా సేవను ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ప్రజలు ఒకసారి ఎన్నుకున్న నాయకుడికే మళ్లీ అవకాశం ఇవ్వడానికి సంకోచిస్తున్న తరుణంలో, కన్నా లక్ష్మీనారాయణ వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఆయన సాధించిన గొప్ప ఘనత అని స్పీకర్ పేర్కొన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి ఆదరాభిమానాలను పొందడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు. రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాలని భావించే వర్ధమాన నాయకులు కన్నా లక్ష్మీనారాయణను ఆదర్శంగా తీసుకుని ఆయన నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేసే నాయకులు అరుదుగా ఉంటారని, అందులో కన్నా ముందువరుసలో ఉంటారని కొనియాడారు. తన వద్దకు వచ్చే ప్రజలను ఆప్యాయంగా పలకరించడం, ప్రజా పనులను వెంటనే పూర్తిచేయడం కన్నా ప్రత్యేక శైలి అని స్పీకర్ విశ్లేషించారు. క్రమశిక్షణతో కూడిన రాజకీయ జీవితాన్ని గడుపుతూ, నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆయన ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. నేటి కాలంలో రాజకీయాలు కొంతవరకు వ్యాపారాత్మక ధోరణిలోకి మారిపోవడం పట్ల అయ్యన్నపాత్రుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు కేవలం అధికార పదవులకే పరిమితం కాకుండా, కన్నా లక్ష్మీనారాయణ తరహాలో ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, సుదీర్ఘ కాలం ప్రజాప్రతినిధిగా వివిధ హోదాల్లో సేవలుందించిన కన్నా లక్ష్మీనారాయణ అనుభవం రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలకు అతీతంగా