ఎన్టీఆర్ చికెన్ ’ కామెంట్స్
Actor ProfileActor

ఎన్టీఆర్ చికెన్ ’ కామెంట్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎన్టీఆర్ చికెన్ ’ కామెంట్స్ పై ఎంఎస్ రాజు క్లారిటీ
Sakshi4 Dec 2026
ఎన్టీఆర్ చికెన్ ’ కామెంట్స్ పై ఎంఎస్ రాజు క్లారిటీ

‘అగధ’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో స్వర్గీయ నందమూరి తారక రామారావుపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం. ఎస్‌ రాజు చేసిన ‘చికెన్‌’ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. పలువురు నెటిజన్స్‌ ఎం.ఎస్‌ రాజుని విమర్శిస్తూ కామెంట్స్‌ చేశారు. తాజాగా ఈ ‘చికెన్‌’ వ్యాఖ్యలపై ఎం.ఎస్‌ రాజు వివరణ ఇచ్చాడు. ఎన్టీఆర్‌పై అంతులేని అభిమానంతోనే ఆ మాటలు అన్నానని.. అంతకు మించి తనకు ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన చెప్పాడు. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఎం.ఎస్‌ రాజు ఏమన్నారంటే.. ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అగధ’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎం.ఎస్‌ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డాడని చెప్పాడు. తను పడిన కష్టం గురించి చెబుతూ..‘ఏడాదిన్నర పాటు ఎన్టీ రామారావు గారిలాగే నేను కూడా ఉదయం 3 గంటలకే నిద్ర లేచాను. ఆయనలాగా చికెన్‌ తినలేదు కానీ.. నేనే పాలు కాచుకొని తాగుదాం అనుకుంటే నా భార్యలేచి కాఫీ పెట్టి ఇచ్చేది. అక్కడ నుంచి మొదలెడితే అర్థరాత్రి వరకు సినిమా గురించే ఏదో ఒక పని చేసేవాడిని’అని చెప్పాడు. అయితే ఎన్టీఆర్‌లాగా చికెన్‌ తినలేదని వ్యంగ్యంగా అనడాన్ని కొంతమంది నెటిజన్స్‌ తప్పుపట్టారు. ఎం.ఎస్‌ రాజుని ట్రోల్‌ చేస్తూ పెద్ద ఎత్తున పోస్టులు చేశారు. అభిమానంతోనే అలా.. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఎం.ఎస్‌ రాజు వివరణ ఇచ్చాడు. రామారావుగారిపై ఉన్న అభిమానంతోనే అలా అన్నానని చెప్పాడు. ‘నేను ఇంత వరకు ఏ సినిమాకి కూడా బ్రహ్మ ముహుర్తంలో లేచి పని చేయలేదు. కానీ ‘అగధ’ కోసం ఎన్టీ రామారావు గారిలా ఉదయం మూడు గంటలకే నిద్ర లేచేవాడ్ని. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని పని చేశాను అని చెప్పే క్రమంలో అందరికీ తెలిసిన విషయాన్ని నేను సరదాగా చెప్పాను. ఆయన ఉదయాన్నే చికెన్ తింటారు అన్నది అందరికీ తెలిసిందే. పొద్దున లేవగానే