
ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్‌లో తీరిక లేకుండా ఉన్న ఎన్టీఆర్ కొత్త లుక్స్ సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ డ్రాగన్ (Dragon). ‘వార్-2’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఈ సినిమాలోని తన పాత్ర కోసం తారక్ ఎన్నడూ లేని విధంగా భారీగా బరువు తగ్గారు. ఆ మధ్య బయటకు వచ్చిన తారక్ అల్ట్రా స్లిమ్ మేకోవర్ చూసి అభిమానులు ఒకింత షాక్‌కు గురయ్యారు. ఒక సినిమా కోసం ఇంతలా బరువు తగ్గాలా అని కంగారు పడుతూ, తమ హీరో లుక్ చూసి అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు కూడా తీవ్ర ఆందోళన చెందారు. అయితే, ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా విడుదలైన 'డ్రాగన్' గ్లింప్స్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయినప్పటికీ, ఆ లుక్ వెనుక ఉన్న తారక్ కష్టం వారిని ఇబ్బంది పెడుతూనే వచ్చింది. ఇందులో ‘లూగర్’ అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్ లుక్ కోసం ఎన్టీఆర్ తన ప్రాణం పెట్టి పనిచేశారు. సినిమా కోసం, తను నమ్మిన పాత్ర కోసం తారక్ ఎంతటి రిస్క్ అయినా తీసుకోగలడు, ఏ స్థాయికైనా వెళ్లగలడు అని తన అంకితభావంతో మరోసారి నిరూపించారు. మొదట ఈ లుక్ చూసి అభిమానులు కొంచెం టెన్షన్ పడినప్పటికీ, ఆ క్యారెక్టర్‌లోని ఇంటెన్సిటీ చూశాక ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాడో అని అందరిలో ఆసక్తి రెట్టింపయింది. అభిమానుల్లో ఉన్న ఆ టెన్షన్‌ను పటాపంచలు చేస్తూ జూలై 6న సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది. అక్కినేని అఖిల్ నటిస్తున్న 'లెనిన్' మూవీ కోసం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ విషయాన్ని పంచుకుంటూ అఖిల్ తన సోషల్ మీడియాలో తారక్‌తో దిగిన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేశారు