ఎన్ కౌంటర్ లో నిందితుడు హతం
Actor ProfilePolitician

ఎన్ కౌంటర్ లో నిందితుడు హతం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎన్ కౌంటర్ లో నిందితుడు హతం
Sakshi8 Oct 2026
ఎన్ కౌంటర్ లో నిందితుడు హతం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. సీన్ రీక్రియేషన్ (నేరస్థల పరిశీలన) కోసం తరలించిన సమయంలో పోలీసుల నుంచి తుపాకీని లాక్కొని పరారవుతుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మృతుడిని ప్రభాస్ మండల్‌గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. దర్యాప్తులో భాగంగా ఘటన జరిగిన తీరును తెలుసుకునేందుకు నిందితుడిని మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:45 గంటల ప్రాంతంలో నేరస్థలానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో అతడు అకస్మాత్తుగా ఒక పోలీసు అధికారి నుంచి ఆయుధాన్ని లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు. నిందితుడిని అడ్డుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మండల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై నిందితుడి తల్లి గతంలో స్పందిస్తూ.. తన కుమారుడు తప్పు చేసి ఉంటే కఠినంగా శిక్షించాలని, ఉరితీయడమో లేదా నరికేయడమో చేయాలని భావోద్వేగంగా పేర్కొన్నారు. కాగా, ఈ అత్యాచార ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. కేసుపై సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీ సిద్ధనాథ్ గుప్తాను ఆదేశించారు. బాలిక మృతదేహం లభ్యమైన తర్వాత జరిగిన ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులను, పోలీసు వాహనాలను ధ్వంసం చేసిన దాదాపు 200 మందిపై చర్యలు తీసుకోనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. దక్షిణ 24 పరగణాల జిల్లా బారూయీపూర్ పట్టణంలో 11 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల్లో ప్రభాస్ మోండల్ ఒకడు. శనివారం బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట మిస్సింగ్ కేసుగా నమోదైనప్పటికీ, ఆ మరుసటి రోజు సూర్జ్యపూర్ ప్రాంతంలోని ఒక చెరువులో బస్తాలో ఉంచిన బాలిక మృతదేహం లభ్యమైంది. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు ఈ కేసులో అత్యాచారం, సామూహిక అత్యాచారం, హత్య, సాక్ష్యాధారాల నాశనం వంటి సెక్షన్లతో పాటు