ఎన్ఆర్ఐలు
Actor ProfilePolitician

ఎన్ఆర్ఐలు

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources3
ఎన్ఆర్ఐలు, ఓసీఐలకు గుడ్ న్యూస్
Sakshi27 Dec 2026
ఎన్ఆర్ఐలు, ఓసీఐలకు గుడ్ న్యూస్

భారత మార్కెట్లలో పెట్టుబడులను ప్రోత్సహించడం, నియంత్రణ నిబంధనలను సులభతరం చేయడమే లక్ష్యంగా మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), విదేశీ భారతీయ పౌరులు (ఓసీఐ), ఇతర విదేశీ పౌరుల కోసం డిజిటల్ ‘నో యువర్ కస్టమర్’(కేవైసీ) ప్రక్రియను మరింత సరళతరం చేయాలని సెబీ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రత్యక్షంగా భారత్‌లోనే ఉండాల్సి వస్తోంది. అయితే, నూతన మార్గదర్శకాల ప్రతిపాదన ప్రకారం.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్‌) నిబంధనలకు కట్టుబడి ఉండే దేశాల్లో నివసిస్తున్న అభ్యర్థులు విదేశాల్లో ఉంటూనే పూర్తి డిజిటల్ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు. ఈ సంస్కరణల ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్లు, ఎలక్ట్రానిక్ సంతకాలు, డిజిటల్ డాక్యుమెంట్ల సమర్పణ సులభతరం కానుంది. అంతేకాకుండా, దరఖాస్తుదారులు డిజిటల్ పద్ధతిలో క్రాప్ చేసిన సంతకం దాఖలు చేయవచ్చు. అనంతరం ‘వీడియో ఇన్-పర్సన్ వెరిఫికేషన్’ సమయంలో ఒరిజినల్ వెట్ సిగ్నేచర్‌(లైవ్‌లో సంతకం చేయిస్తారు)ను పరిశీలిస్తారు. ఇదే కాకుండా, ఎన్‌ఆర్‌ఐ కస్టమర్ల కేవైసీ రికార్డులను ప్లాట్‌ఫారమ్‌ల మధ్య మార్చుకునేలా సెబీ డిస్కషన్ పేపర్‌లో ఆమోదం తెలిపింది. కేవైసీ నమోదు ఏజెన్సీలు అధికారిక డేటాబేస్‌ల ద్వారా వివరాలను సరిచూసుకుని ధ్రువీకరించినది(వెరిఫైడ్‌)గా ట్యాగ్ చేస్తాయి. స్టాక్ బ్రోకర్లు, డిపాజిటరీ పార్టిసిపెంట్లకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను పెంచేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని సెబీ పేర్కొంది. మార్కెట్ వాటాదారులు, విదేశీ పెట్టుబడిదారుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ బ్లూప్రింట్‌పై ఆసక్తి కలిగిన వర్గాలు సెప్టెంబర్ 4 నాటికి తమ సలహాలు, సూచనలను అందజేయాలని సెబీ కోరింది. నిబంధనల సరళీకరణతో భారత సెక్యూరిటీల మార్కెట్లోకి విదేశీ నిధుల ప్రవాహం వచ్చే అవకాశముందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇది చదవండి: ఒరిజినల్‌ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి? ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్‌జీ’

టీటీడీ కీలక నిర్ణయం.. ఎన్నారైలకు షాక్
Telugu Times20 Oct 2026
టీటీడీ కీలక నిర్ణయం.. ఎన్నారైలకు షాక్

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధమాకా.. మోకిలా ప్లాట్ల వేలానికి భారీ రెస్పాన్స్.. చదరపు గజం ధర రూ. 80,000
Zee Telugu18 Aug 2026
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధమాకా.. మోకిలా ప్లాట్ల వేలానికి భారీ రెస్పాన్స్.. చదరపు గజం ధర రూ. 80,000

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో