ఎగువన భారీ వర్షాలు.. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉగ్రరూపం
Actor ProfilePolitician

ఎగువన భారీ వర్షాలు.. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉగ్రరూపం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎగువన భారీ వర్షాలు.. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉగ్రరూపం
Zee Telugu7 Oct 2026
ఎగువన భారీ వర్షాలు.. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉగ్రరూపం

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Polavaram Project: మహారాష్ట్రలో కురుస్తున్న కుండపోత వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద నీరు పోటెత్తుతోంది. ఈ ఏడాది సీజన్‌లోనే తొలిసారిగా పోలవరం ప్రాజెక్టు వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్రతో పాటు ముంబై పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు వద్ద నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం పోలవరం స్పిల్వే వద్ద నీటిమట్టం 26.69 మీటర్లకు చేరింది. అటు ఎగువ కాపర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 26.80 మీటర్లుగా నమోదైంది. వరద ఉధృతి క్షణక్షణానికి పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వేలో ఉన్నటువంటి మొత్తం 48 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఒకేసారి 48 గేట్లను ఎత్తేయడం ఇదే తొలిసారి. స్పిల్ ఛానల్ మీదుగా ప్రవాహం అత్యంత భీకరంగా సాగుతుండగా.. ఈ ఉధృత ప్రవాహానికి కింద పనుల రవాణా కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతోపాటు నీటి ప్రవాహం కోసం వేసిన భారీ ఐరన్ తూరలు, ఐరన్ పైపులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో స్పిల్ ఛానల్ కింద నుంచి పనుల కోసం వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ప్రస్తుతానికి కేవలం స్పిల్‌వే మీదుగా వెళ్లే రోడ్డు మార్గం మాత్రమే అందుబాటులో ఉంది. అక్కడ ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ వరద ప్రభావం ఆ పనులపై పడే