ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్
Actor ProfilePolitician

ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources2
గొప్ప కెప్టెన్ అవుతాడు.. శ్రేయస్ కు మద్దతుగా నిలిచిన సోదరి శ్రేష్ఠ
Andhra Jyothy16 Oct 2026
గొప్ప కెప్టెన్ అవుతాడు.. శ్రేయస్ కు మద్దతుగా నిలిచిన సోదరి శ్రేష్ఠ

భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు వరుస పరాజయాలు ఎదురవుతుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రేయస్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ తన సోదరుడికి మద్దతుగా నిలిచింది. స్పోర్ట్స్ డెస్క్

రొనాల్డినోలా జైలుకు పంపుతా.. ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్
Andhra Jyothy15 Oct 2026
రొనాల్డినోలా జైలుకు పంపుతా.. ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్

ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ సూపర్ స్టార్ క్లియాన్ ఎంబాపె , పరాగ్వే సెనెటర్ సెలెస్టే అమరిల్లా మధ్య వివాదం ముదురుతోంది. ఫిఫా ప్రపంచ కప్‌2026లో పరాగ్వేపై ఫ్రాన్స్‌ విజయం అనంతరం ఎంబాపెను అమరిల్లా టార్గెట్

ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్
Eenadu15 Oct 2026
ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్

ఇంటర్నెట్ డెస్క్‌: ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ సూపర్ స్టార్ క్లియాన్ ఎంబాపె (Kylian Mbappe), పరాగ్వే సెనెటర్ సెలెస్టే అమరిల్లా మధ్య వివాదం ముదురుతోంది. ఫిఫా ప్రపంచ కప్‌లో పరాగ్వేపై ఫ్రాన్స్‌ విజయం అనంతరం ఎంబాపెను అమరిల్లా టార్గెట్ చేశారు. దీనిపై ఆ ఫుట్‌బాలర్‌ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించాడు. అతడి పోస్ట్‌పై తాజాగా అమరిల్లా అసభ్య పదజాలంతో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇవాళ అర్ధరాత్రి ప్రపంచ కప్‌లో మొరాకోతో క్వార్టర్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ తలపడనుంది. ఈ క్రమంలో ఎంబాపె వార్తల్లో నిలవడం గమనార్హం. ఇంతకీ వివాదం ఏంటంటే..? ప్రిక్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌ - పరాగ్వే (France Vs Paraguay) జట్లు తలపడ్డాయి. చివరకు ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంతో పరాగ్వేను ఓడించింది. ఎంబాపె 70వ నిమిషంలో గోల్‌ కొట్టి తన జట్టును గెలిపించాడు. మ్యాచ్‌ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకొనేందుకు వచ్చారు. ఆ సమయంలో ఒర్లాండో గిల్‌ అనే కుర్రాడికి చేయి ఇచ్చేందుకు ఎంబాపె విముఖత ప్రదర్శించాడు. దీనిపై పరాగ్వే సెనేటర్ అమరిల్లా స్పందించారు. ‘‘ఫ్రాన్స్‌ అంటే మానవ హక్కులకు తార్కాణం. రూసో, డెకార్టెస్, మాంటెస్క్యూ వంటి అద్భుతమైన వ్యక్తులు పుట్టిన నేల. అంత గొప్ప ఫ్రాన్స్‌ను.. ఆ దేశ సాంస్కృతిక, కళాత్మక, ప్రజాస్వామ్య వారసత్వాన్ని తగ్గించడం సరికాదు. ఫుట్‌బాల్‌లో ఎదుగుతోన్న ఓ కుర్రాడి పట్ల ఎంబాపె చూపించిన ధోరణి అత్యంత హేయమైనది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. దీనికి ఎంబాపె ఘాటుగా స్పందించాడు. ‘‘మేడమ్ అమరిల్లా.. మీరు ఈ (సెనెటర్‌) పదవికి అనర్హులు. ఫిఫా ప్రపంచ కప్‌ (FIFA World Cup 2026)లో గొప్ప ఆటతీరుతో చెమటోడ్చిన, గౌరవంగా పోటీపడిన పరాగ్వేకు మీరు ప్రతినిధి కాలేరు. మీ జాత్యహంకారం వల్లే మీ ప్లేయర్లు సాధించిన గొప్పతనం, కృషిని యావత్ ప్రపంచం మరిచిపోయింది. అయితే.. ఇలాంటి ద్వేషాన్ని, వివక్షను వ్యాప్తి చేసే స్వేచ్ఛను మీకు నేను ఎప్పటికీ ఇవ్వను’’ అని ఎంబాపె