
పురుగుమందు అవశేషాలున్నాయని సరుకును తిరస్కరించిన చైనా వాణిజ్యపరంగా భారత్‌ను దెబ్బతీసేందుకే చైనా ఎత్తుగడలని అనుమానాలు ఎగుమతులపై ఆంక్షల నేపథ్యంలో సీసీఎఫ్‌ఐ శ్వేతపత్రం విడుదల అంతర్జాతీయంగా కేంద్రం ఒత్తిడి తీసుకురావాలంటున్న నిపుణులు సాక్షి, అమరావతి: భారత్ నుంచి చైనాకు ఎగుమతి చేసిన ఎండుమిర్చిని చైనా తిరస్కరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పురుగుమందుల అవశేషాలు (ఎంఆర్‌ఎల్) పరిమితికి మించి ఉన్నాయని పేర్కొన్న చైనా ఇందుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు, ప్రయోగశాల పరీక్ష నివేదికలను ఇప్పటిæవరకు వెల్లడించలేదు. ఇది నిజంగా ఆహారభద్రత కోసమా? లేక భారత ఎగుమతులను అడ్డుకునేందుకు తీసుకున్న వాణిజ్య నిర్ణయమా? అని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మిరప ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీదే అగ్రస్థానం ఎండుమిర్చి ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఏటా ఆరులక్షల టన్నుల నుంచి ఎనిమిదిలక్షల టన్నుల మిరప ఉత్పత్తులు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. దీన్లో 2 లక్షల టన్నులకుపైగా చైనాకు వెళతాయి. దీంతో మన దేశానికి అతిపెద్ద మిరప మార్కెట్‌గా చైనా కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్టాల్లో పండే తేజ రకం మిర్చికి చైనాలో ప్రత్యేక డిమాండ్ ఉంది. మనదేశం నుంచి అయ్యే మిరప ఎగుమతుల్లో 40 శాతం మన రాష్ట్రం నుంచే జరుగుతున్నాయి. అలాంటి మిరప ఉత్పత్తుల ఎగుమతులపై ఇటీవల వస్తున్న ఆరోపణలు దేశీయ మిరప మార్కెట్‌ను సంక్షోభానికి గురిచేస్తోంది. ఈ ఏడాది చైనాకు ఎగుమతి అయిన కంటైనర్లలో పురుగుమందు అవశేషాలు మోతాదుకు మించి ఉన్నాయంటూ తిరస్కరణకు గురవడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. శాస్త్రీయ ఆధారాలను చైనా బయటపెట్టాలి ప్రపంచ ఆహారభద్రత ప్రమాణాలను రూపొందించే కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్.. ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) ఆధ్వర్యంలో ఎంఆర్‌ఎల్ ప్రమాణాలను నిర్ణయిస్తుంది. డబ్ల్యూహెచ్‌వో పరిధిలోని ఎస్‌పీఎస్ (మానవ, జంతు, మొక్కల ఆరోగ్యరక్షణ చర్యలు) ఒప్పందం ప్రకారం ఒక దేశం దిగుమతి సరుకును తిరస్కరిస్తే, అందుకు తగిన పరీక్ష నివేదికలు, శాస్త్రీయ ఆధారాలు, తిరస్కరణకు