ఎంఎస్ ధోనీ 45వ పుట్టిన రోజు.. టికెట్ క లెక్ట ర్ టూ ట్రోఫీ క లెక్ట ర్
Actor ProfilePolitician

ఎంఎస్ ధోనీ 45వ పుట్టిన రోజు.. టికెట్ క లెక్ట ర్ టూ ట్రోఫీ క లెక్ట ర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎంఎస్ ధోనీ 45వ పుట్టిన రోజు.. టికెట్ క లెక్ట ర్ టూ ట్రోఫీ క లెక్ట ర్
10TV Telugu3 Oct 2026
ఎంఎస్ ధోనీ 45వ పుట్టిన రోజు.. టికెట్ క లెక్ట ర్ టూ ట్రోఫీ క లెక్ట ర్

MS Dhoni : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పుట్టిన రోజు నేడు (జూలై 7). 45వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన ధోనికి సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. త‌న క్రికెట్ ప్ర‌యాణం, సాధించిన ఘ‌న‌త‌ల‌ను ఓ సారి చూద్దాం.. క్రీడా చరిత్రలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన ప్రయాణాలలో ధోనీది ఒకటి. రైల్వే స్టేషన్‌లో టికెట్ కలెక్టర్‌గా పనిచేసిన అతను, కెప్టెన్‌గా జట్టుకు 2007 టీ20 ప్రపంచ కప్, 2011 ప్రపంచ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలను అందించి భార‌త దేశానికి అతి పెద్ద ట్రోఫీ క‌లెక్ట‌ర్‌గా ఎదిగాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ధోని త‌నదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి నాళ్ల‌లో బంతిని బ‌లంగా బాదే ఆట‌గాడిగా పేరు తెచ్చుకున్న అత‌డు కాలక్రమేణా, తన వ్యూహాత్మక దూకుడు, అద్భుతమైన ఎత్తుగడలతో జట్టును విజయాల వైపు నడిపించే ఫినిషర్‌గా మారాడు. Cristiano Ronaldo : రొనాల్డో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. నేను రాక‌ముందు పోర్చుగ‌ల్ ఒక్క ట్రోఫీ గెల‌వ‌లేదు..నేనే మూడు టైటిళ్లు అందించా.. టీమ్ఇండియా తరపున అన్ని ఫార్మాట్లలో 538 మ్యాచ్‌లు ఆడాడు. 17,266 అంతర్జాతీయ పరుగులు చేశాడు. 829 డిస్మిసల్స్ లో పాలు పంచుకున్నాడు. 350 వన్డేల్లో 50.57 సగటుతో 10,773 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 183 నాటౌట్. 200 వ‌న్డేల్లో భార‌త జ‌ట్టుకు నాయ‌క‌త్వం వహించాడు. అత‌డి సార‌థ్యంలో భార‌త్ 110 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 74 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఐదు మ్యాచ్‌లు టై కాగా.. 11 మ్యాచ్‌లు ఫ‌లితం తేల‌లేదు. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 37.60 సగటుతో 126.13 స్ట్రైక్ రేట్‌తో 1,617 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 56. 5⃣3⃣8⃣ Intl Matches 🙌 1⃣7⃣,2⃣6⃣6⃣ Intl Runs 👌 8⃣2⃣9⃣ Intl Dismissals behind the stumps