
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల స్థానిక కేడర్ల లో పోస్టుల కేటాయింపు పై తుది మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా కేడర్ నిర్ణయంచేలా స్పష్టత ఇచ్చింది. జోన్లు.. మల్టీ జోన్ల వారీగా పోస్టుల కేటాయింపు పైన మార్గదర్శకాలు ఖరారు చేసింది. దీనికి సంబంధించి ఉత్తర్వుల్లో పూర్తి వివరాలను వెల్లడించింది. ఈ సమయంలో ఉద్యోగుల బదిలీల పై నిషేధం విధించింది.ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల కేడర్ ఖరారు పైన స్పష్టత ఇచ్చింది. కేడర్ సంఖ్య నిర్ధారణ, పంపిణీ, అమలు మార్గదర్శకా ల పై ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వు-2025 ప్రకారం 26 జిల్లాలకు ప్రభుత్వం లోకల్ కేడర్ నిర్ధారణ చేయనుంది. మార్కాపురం, పోలవరం జిల్లాలు రాష్ట్రపతి ఉత్తర్వు-2025 పరిధిలోకి రావని తెలిపింది. ఈ రెండు జిల్లాలకు ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్కింగ్ స్ట్రెంగ్త్ పంపిణీకి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్ల వారీగా పోస్టుల కేటాయింపు జరగనుంది. సేవల అవసరం, పరిపాలనా అవసరాల ఆధారంలో పోస్టుల పంపిణీ జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. జమిలి, డీలిమిటేషన్ పై కేంద్రం బిగ్ ట్విస్ట్ - విపక్షాలు ఊహించని విధంగా..!!ప్రభుత్వం మార్గదర్శకాలు జారీకాగా, శాఖల వారీగా పోస్ట్స్ అలొకేషన్ రేషియో రూపొందించి, మండలాల వారీగా అందుబాటులో ఉన్న సేవల డేటాతో PAR నిర్ణయించాలని ఆదేశించింది. అన్ని ప్రభుత్వ శాఖలు ప్రత్యేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా తమ ప్రతిపాదనలను సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. ఆపై, ఆర్థిక శాఖ ఆమోదంతో తుది పోస్టుల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు జీవోలో పేర్కొంది. రాష్ట్ర సచివాలయం,హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ కార్యాలయాలు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, న్యాయశాఖ పోస్టులు, అలాగే పబ్లిక్ సెక్టార్ సంస్థల పోస్టులకు ఈ మార్గదర్శకాలు వర్తించవని స్పష్టం చేసింది. సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త పోస్టుల