ఉద్యోగాల పేరుతో వైసీపీ నిరుద్యోగులకు ఎంతో ద్రోహం
Actor ProfilePolitician

ఉద్యోగాల పేరుతో వైసీపీ నిరుద్యోగులకు ఎంతో ద్రోహం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉద్యోగాల పేరుతో వైసీపీ నిరుద్యోగులకు ఎంతో ద్రోహం
Telugu Times14 Dec 2026
ఉద్యోగాల పేరుతో వైసీపీ నిరుద్యోగులకు ఎంతో ద్రోహం

గ్రూప్-1 అక్రమాలు, గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయానికి నిదర్శమని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు యత్నించారనడానికి ఈ అక్రమాలే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ఉద్యోగాల పేరుతో వైసీపీ ( YCP) నిరుద్యోగులకు ఎంతో ద్రోహం చేసిందని మండిపడ్డారు. అమరావతిలో ఎస్ఐపిబి (SIPB) సమావేశం అనంతరం అందుబాటులో ఉన్నమంత్రులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రులతో పలు అంశాలపై చర్చించారు. హైకోర్టుకు సిట్ సమర్పించిన నివేదిక చూస్తే గ్రూప్-1 ( Group-1)అక్రమాల గురించి తెలుస్తుంది. ఈ నివేదికను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలి. ఇంత దారుణంగా జవాబు పత్రాల మÖల్యాంకనం ఎప్పుడూ జరగలేదు. నిరుద్యోగులకు చేసిన మోసంపై వైసీపీని ప్రజలు నిలదీయాలి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకు పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ (DSC)పై కుట్రపూరితంగా విషప్రచారం చేస్తున్నారు. డీఎస్సీపై వచ్చిన విమర్శలను ప్రభుత్వం గట్టిగా తిప్పికొట్టింది. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగాలి అని సూచించారు