ఉద్యోగులు ఎగిరిగంతేసే గుడ్ న్యూస్.. జులై 15లోపు ఖాతాల్లో డబ్బులు.. 34 కోట్ల మందికి లబ్ధి
Actor ProfilePolitician

ఉద్యోగులు ఎగిరిగంతేసే గుడ్ న్యూస్.. జులై 15లోపు ఖాతాల్లో డబ్బులు.. 34 కోట్ల మందికి లబ్ధి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉద్యోగులు ఎగిరిగంతేసే గుడ్ న్యూస్.. జులై 15లోపు ఖాతాల్లో డబ్బులు.. 34 కోట్ల మందికి లబ్ధి
Samayam Telugu10 Oct 2026
ఉద్యోగులు ఎగిరిగంతేసే గుడ్ న్యూస్.. జులై 15లోపు ఖాతాల్లో డబ్బులు.. 34 కోట్ల మందికి లబ్ధి

EPF Interest: ప్రైవేట్, ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరే శుభవార్త చెప్పింది. గత కొన్నినెలలుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ ఎప్పుడు జమ అవుతుందా అని ఎదురుచూస్తున్న కోట్లాది మంది ఉద్యోగుల నిరీక్షణకు తెరపడింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26కి గాను 8.25 శాతం మేర వడ్డీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ వడ్డీని జులై 15, 2026 తేదీలోపు పూర్తి స్థాయిలో ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించి, అందుకు అన్ని సిద్ధం చేస్తోంది. జులై 15వ తేదీలోపు ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ జమ కానుంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. 34 కోట్ల మందికి లబ్ధిఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) గత ఆర్థిక ఏడాది 2025-26కి సంబంధించి నిర్ణయించిన 8.25 శాతం వడ్డీని జులై 15వ తేదీలోపు మొత్తం 34 కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు ప్రకటించింది. 34 కోట్ల మంది ఉద్యోగులకు మొత్తం రూ.1.44 లక్షల కోట్లు వడ్డీ డబ్బులు జమ చేస్తున్నామని తెలిపింది. ఇది కొత్త సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ (CITES) సిస్టమ్ ద్వారా జమ చేస్తోన్న అతిపెద్ద వడ్డీ పంపిణీగా పేర్కొంది. ఈపీఎఫ్ఓ ప్రకారం చందాదారుల అకౌంట్లలో వడ్డీ డబ్బులు జమ చేసే ముందే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతోంది. సాధారణంగా వడ్డీ రేటును నిర్ణయించిన తర్వాత తమ అకౌంట్లలోకి జమ అయ్యేందుకు ఉద్యోగులు అక్టోబర్, నవంబర్ వరకు వేచి చూడాల్సి వస్తోంది. అయితే, కొత్త సెంట్రలైజ్డ్ టెక్నాలజీ ప్లాట్ ఫామ్ ద్వారా ఈ ప్రాసెస్ స్వయంచాలితంగా మారింది. దీంతో ఇంట్రెస్ట్ జమ చేయడం చాలా త్వరగా పూర్తవుతోంది.ఈపీఎఫ్ వడ్డీ ముఖ్యాంశాలు మొత్తం వడ్డీ రేటు 8.25 శాతం ఆఖరు తేదీ జులై 15, 2026 మొత్తం లబ్ధిదారులు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాలు విడుదలవుతున్న మొత్తం నిధులు