ఉత్తర అమెరికా పెట్టుబడుల ప్రధాన అనుసంధాన ప్రతినిధిగా సతీష్ మండువ నియామకం
Actor ProfilePolitician

ఉత్తర అమెరికా పెట్టుబడుల ప్రధాన అనుసంధాన ప్రతినిధిగా సతీష్ మండువ నియామకం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉత్తర అమెరికా పెట్టుబడుల ప్రధాన అనుసంధాన ప్రతినిధిగా సతీష్ మండువ నియామకం
Telugu Times7 Oct 2026
ఉత్తర అమెరికా పెట్టుబడుల ప్రధాన అనుసంధాన ప్రతినిధిగా సతీష్ మండువ నియామకం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఐటీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో, రాష్ట్రంలోకి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భాగంగా, ప్రముఖ పారిశ్రామికవేత్త , సామాజిక సేవకుడు సతీష్ మండువను ఉత్తర అమెరికాకు పెట్టుబడుల ప్రధాన అనుసంధాన ప్రతినిధిగా నియమిస్తూ జూలై 6, 2026న ప్రభుత్వం ఉత్తర్వులు (జి.ఓ. ఆర్.టి. నెం.1333) జారీ చేసింది. సతీష్ మండువ బాధ్యతలు: ఈ కొత్త బాధ్యతలో సతీష్ మండువ ఉత్తర అమెరికాలోని ప్రముఖ వ్యాపార సంస్థలు, పరిశ్రమల అధిపతులు , పెట్టుబడిదారులతో సమన్వయం చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో గల పెట్టుబడి అవకాశాలను వారి దృష్టికి తీసుకువెళ్లడం, రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడం ఆయన ప్రధాన లక్ష్యం. తద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చేందుకు ఆయన తన వంతు కృషి చేయనున్నారు. సతీష్ మండువ నేపథ్యం: ఒంగోలు సమీపంలోని ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన సతీష్ మండువ, విద్యాపరంగా GPREC నుండి ఇంజినీరింగ్ , యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ టైలర్ నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. 1997లో ఆయన స్థాపించిన ‘ఇంటెల్లిసాఫ్ట్ టెక్నాలజీస్’ నేడు గ్లోబల్ టెక్నాలజీ సంస్థగా ఎదిగింది. సిపెరా సిస్టమ్స్ వంటి సంస్థల సహ-స్థాపకులుగా , Datamorphix.ai, Orionox, HRChex వంటి వినూత్న వేదికల ద్వారా టెక్నాలజీ, విద్య, , డేటా రంగాల్లో ఆయన విశేష అనుభవం గడించారు. పరిశ్రమలో అనుభవం , సామాజిక సేవ: రెండు దశాబ్దాలకు పైగా పరిశ్రమ నాయకత్వంలో సేవలందిస్తున్న సతీష్, ITServe Alliance వ్యవస్థాపక అధ్యక్షుడిగా , ప్రస్తుతం US–India Chamber of Commerce DFW బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విద్య, గ్రామీణాభివృద్ధి , డిజిటల్ క్లాస్‌రూమ్స్ వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్త నెట్‌వర్క్ , నైపుణ్యాన్ని ఉపయోగించి, ఆంధ్రప్రదేశ్‌కు భారీ