ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు
Actor ProfilePolitician

ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు
Eenadu26 Dec 2026
ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు

మద్నూర్ : స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తమ సేవలు అందించిన పలువురికి ప్రశంసా పత్రాలు అందించారు. మండలంలోని రెవెన్యూ, పోలీస్ విభాగంలో ఉత్తమ ఉద్యోగులుగా శనివారం ఇద్దరు ఎంపికయ్యారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ రవి కుమార్, మద్నూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విట్టల్‌ ప్రశంసా పత్రం అందుకున్నారు. మద్నూర్ : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని గురుకుల, జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రుల స్థల దాత శ్రీ సేట్ రాంప్రసాద్ ఇనాని కుటుంబీకులు మరోసారి తమ గొప్ప మనసు చాటుకున్నారు. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల, కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శనివారం స్వాంతంత్య్ర వేడుకల్లో పాల్గొని నగదు ప్రోత్సాహకం అందజేశారు. గతేడాది ఎక్కువ మార్కులు సాధించిన 11 మంది విద్యార్ధులకు రూ.36 వేల నగదు ఇనాని సేట్ బంధువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపల్ సుధాకర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పాండురంగా, గ్రామస్థులు అజయ్, మొగులాజీ తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు