ఉత్తమ సేవా అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం
Actor ProfilePolitician

ఉత్తమ సేవా అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉత్తమ సేవా అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం
HMTV7 Jan 2027
ఉత్తమ సేవా అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం

Veeraballi: ఉత్తమ సేవా అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం! Veeraballi: స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా అత్యుత్తమ సేవలకు జిల్లా స్థాయి అధికారుల చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్న ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది కల్పన, 108 వాహన పైలట్ లోకేష్ లను సోమవారం విఆర్డిఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షుడు సురేంద్రారెడ్డి, డాక్టర్ నరేష్ సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు నిజాయితీగా పని చేస్తున్న వారిని ఎప్పుడూ ప్రభుత్వం గుర్తిస్తుందని తెలిపారు.అంబులెన్స్ డ్రైవర్లు ప్రాణాలను కాపాడే అత్యవసర వైద్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.రోగులను వేగంగా ఆసుపత్రులకు చేర్చడంలో, ప్రాథమిక సహాయం అందించడంలో నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.వైద్య సిబ్బంది నారాయణ, లక్ష్మి, ఉషాబాల, వెంకటకృష్ణ 108 సిబ్బంది ఆంజనేయులు,రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు