
రాష్ట్రంలో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు విద్యారంగంలో గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దే ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ లో 37మందిని సింగపూర్ పంపించిన రాష్ట్రప్రభుత్వం... తాజాగా మరో 29మందిని ఫిన్లాండ్ పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 17 నుంచి 26వ తేదీ వరకు 8రోజులపాటు ఉత్తమ ఉపాధ్యాయులు ఫిన్లాండ్ లో పర్యటించనున్నారు. ఫిన్లాండ్ విద్యారంగంలోని ఉత్తమ బోధనా పద్ధతులను అధ్యయనం చేసి, రాష్ట్రంలో సహ ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇచ్చేలా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. అంతర్జాతీయ వృత్తిపర అభివృద్ధి కార్యక్రమం (International Proffessional Development Programme) పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మార్గదర్శక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 2026 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 29 మంది టీచర్లను ఫిన్లాండ్‌లోని టుర్కు విశ్వవిద్యాలయంలో నిర్వహించే ప్రొఫెషనల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ లో పాల్గొనే అవకాశం కల్పించడం ద్వారా వారికి అంతర్జాతీయ అనుభవాన్ని అందించాలని నిర్ణయించారు. ప్రపంచ స్థాయి విద్యా విధానాలు, వినూత్న బోధనా పద్ధతులను ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయులకు అవకాశం కల్పించడం, తద్వారా రాష్ట్రంలో బోధన, అభ్యసన నాణ్యతను బలోపేతం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఫిన్లాండ్‌లోని టుర్కు విశ్వవిద్యాలయంతో కలిసి జాయ్ అండ్ ప్లే పద్ధతి ద్వారా… ప్రారంభ బాల్య విద్య (Early Childhood Education), ప్రాథమిక విద్య (Basic Education)లో వృత్తిపర శిక్షణా కార్యక్రమం (Proffessonal Development Programme)ని రూపొందించారు. ఈ కార్యక్రమం ఫిన్లాండ్‌లోని అత్యుత్తమ విద్యా వ్యవస్థ ద్వారా మన ఉపాధ్యాయుల వృత్తిపర సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తుంది. ఇందులో బాల-కేంద్రిత అభ్యసన (Child-centred Learning), ఆనందదాయక బోధన (Joyful Pedagogy), ఆట ఆధారిత విద్య (Play based Education) వంటి వినూత్న తరగతి గది బోధనా పద్ధతులకు