ఉచిత బస్సు ప్రయాణంతో భారీ నష్టాలు.. 20 నుండి కేరళలో ప్రైవేట్ బస్సుల నిరవధిక సమ్మె
Actor ProfilePolitician

ఉచిత బస్సు ప్రయాణంతో భారీ నష్టాలు.. 20 నుండి కేరళలో ప్రైవేట్ బస్సుల నిరవధిక సమ్మె

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉచిత బస్సు ప్రయాణంతో భారీ నష్టాలు.. 20 నుండి కేరళలో ప్రైవేట్ బస్సుల నిరవధిక సమ్మె
AP7AM25 Oct 2026
ఉచిత బస్సు ప్రయాణంతో భారీ నష్టాలు.. 20 నుండి కేరళలో ప్రైవేట్ బస్సుల నిరవధిక సమ్మె

కేరళలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'ప్రియదర్శిని' ఉచిత బస్సు ప్రయాణ పథకం తీవ్ర వివాదానికి కారణమైంది. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల తాము ఆర్థికంగా కుదేలవుతున్నామని ఆరోపిస్తూ, రాష్ట్రంలోని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఈ నెల 20 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి వి.డి.సతీశన్ సర్కార్ 'ఇందిరా గ్యారెంటీ'లో భాగంగా జూన్ 15న ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్ఆర్టీసీ) ఆర్డినరీ బస్సుల్లో మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే, కేవలం ప్రభుత్వ బస్సులకే ఈ పథకాన్ని పరిమితం చేయడంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయించడం తగ్గించారు. ఫలితంగా, నెల రోజుల్లోనే నష్టాలు భరించలేక సుమారు 500 ప్రైవేట్ బస్సులు తమ సర్వీసులను నిలిపివేశాయి."ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ, అదే తరహా సబ్సిడీలు, రాయితీలను మాకు కూడా వర్తింపజేయాలి" అని ఆల్ కేరళ బస్ ఆపరేటర్స్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ టి. గోపినాథన్ డిమాండ్ చేశారు. ఈ పరిశ్రమపై ఆధారపడిన 28,000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 70 శాతం రూట్లలో ప్రైవేట్ బస్సులే (7,000) సేవలందిస్తుండగా, ప్రభుత్వ బస్సులు (4,000) మూడో వంతు మాత్రమే ఉన్నాయి.మరోవైపు, ఈ పథకం ప్రైవేట్ ఆపరేటర్లనే కాకుండా, ప్రభుత్వ రంగ సంస్థ అయిన కేఎస్ఆర్టీసీని కూడా ఆర్థికంగా దెబ్బతీస్తుందని రవాణా శాఖ మాజీ