
నల్గొండ అర్బన్, న్యూస్‌టుడే: ఎల్‌నినో నేపథ్యంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో గత వారం రోజులుగా సీజనల్ వ్యాధులతో బాధితులు పెద్ద ఎత్తున ఆసుపత్రుల బాట పడుతున్నారు. వర్షాకాలంలో సైతం భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్తమా, తలనొప్పి, చర్మవ్యాధులు, ముక్కు, చెవి, గొంతుకు సంబంధించిన వ్యాధుల బారిన పడుతున్నారు. సీజనల్ వ్యాధులతో పాటు బీపీ, షుగర్ బాధితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిట లాడుతున్నాయి. ప్రధానంగా పదేళ్లలోపు చిన్నారులతో పాటు 50 ఏళ్లు దాటిన వృద్ధులు ఎక్కువ మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జున సాగర్, నకిరేకల్, మర్రిగూడ ఏరియా ఆసుపత్రుల్లో గత వారం రోజుల నుంచి ఓపీ 400 నుంచి 600, ఐపీ 70 నుంచి 200 వరకు ఉంటుంది. వీటితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానాలు, పల్లె దవాఖానాల్లో గతంలో కంటే 25 నుంచి 30 శాతం ఓపీ పెరిగిందని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో ఆసుపత్రుల్లో ఆస్తమా, చర్మవ్యాధులు, తీవ్ర జ్వరంతో రోగులు ఎక్కువగా వస్తున్నారు. వర్షాకాలంలో వేడివాతావరణం, ఉక్కపోత కారణంగా చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి రోజు 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి. ఇంట్లో చేసిన వంటలకే ప్రాధాన్యం ఇవ్వాలి. చర్మం పొడిబారే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఉదయం, సాయంత్రం స్నానం చేయడంతో పాటు పలచని దుస్తులు ధరించడం మంచిది. సీజనల్ వ్యాధులతో బాధపడేవారు వైద్యుల సూచనలు పాటించడం మంచిది. ఇటీవల కొంత మంది సామాజిక మాధ్యమాల్లో చూసి సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఇది శ్రేయస్కరం కాదు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని