ఈసారి యువ నాయకులకే బీఆర్ఎస్ టిక్కెట్లు
Actor ProfileCelebrity

ఈసారి యువ నాయకులకే బీఆర్ఎస్ టిక్కెట్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈసారి యువ నాయకులకే బీఆర్ఎస్ టిక్కెట్లు
HMTV13 Dec 2026
ఈసారి యువ నాయకులకే బీఆర్ఎస్ టిక్కెట్లు

Off The Record: ఈసారి యువ నాయకులకే బీఆర్ఎస్ టిక్కెట్లు! Off The Record: తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు పార్టీని అంతగా పట్టించుకొని బిఆర్‌ఎస్ అధినాకత్వం ఇప్పుడు దూకుడుగా వెళ్తోందన్న టాక్ రీసౌండ్ చేస్తోంది. ఇది పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. గులాబీ పార్టీ అధిష్టానం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోందన్న చర్చ లేకపోలేదు. ఈసారి ఎన్నికల్లో ఎవరెవరికి అవకాశాలు ఇవ్వాలి..? టికెట్లు కేటాయించకపోతే మిగతా కీలక పదువులు ఎలా కేటాయించాలి..? ఎవరెవరు పార్టీ కోసం పని చేస్తున్నారు..? రాబోయే రోజుల్లో ఎవరికి ఛాన్స్ ఇస్తే పార్టీని గెలిపిస్తారు..? ఎవరెవరు ప్రజల్లో మమేకం అవుతున్నారు..? ఇవే అంశాలు ప్రామాణికంగా కారు పార్టీ ఆలోచన చేస్తోందట. అయితే గత ఎన్నికల్లో లాగా కాకుండా.. పాత నేతలకు బీఆర్ఎస్ ఈసారి షాక్ ఇవ్వనుందన్న టాక్ బలంగానే వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత బిఆర్‌ఎస్ నేతలకు పదవులు ఇస్తూ వచ్చింది. 2018 ఎన్నికల్లో ఏకంగా 88 స్థానాల్లో విజయ దుంధుబి మోగించి అధికారకలోకి దూసుకొచ్చింది కారు పార్టీ. కానీ.. 2023 ఎన్నికల్లో ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతనో మరో కారణమో కానీ.. 39 స్థానాలకే పరిమితమై ప్రతిపక్షం కూర్చోవాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని గుణపాఠంగా తీసుకుని.. గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపే దిశగా ఆ పార్టీ అధినేతలు ప్రయత్నిస్తునే ఉన్నారు. రాబోయే ఎన్నికల నాటికి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అవసరమైన సర్వ శక్తులూ ఒడ్డుతోంది పార్టీ హైకమాండ్. ఇదే క్రమంలో 2018 ఎన్నికల సమయంలో కారు పార్టీ 100కు పైగా స్థానాలు గెలుస్తుందని ఆశించినా.. 88 స్థానాలకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు జనంలో లేనట్టే లెక్క అని పార్టీ అధినేతలు ఎన్నో సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అలా ఓటమి చవిచూసిన అభ్యర్థులకు మరోసారి ఛాన్స్ ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది