
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పీఎం ఇ-డ్రైవ్ పథకంలో కీలక మార్పులు చేసింది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ దిచక్ర వాహనాలపై ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని తగ్గించినప్పటికీ.. పథకం గడువును మాత్రం 2028 మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాల కేటగిరీకి గతంలో కేటాయించిన రూ.1772 కోట్ల బడ్జెట్‌ను రూ. 2,767 కోట్లకు పెంచడం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 46 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ ప్రయోజనం దక్కనుంది.రోడ్డు ప్రమాదాలకు చెక్: ఇకపై వాహనాలే మాట్లాడుకుంటాయి! పీఎం ఇ-డ్రైవ్ సబ్సిడీని తగ్గించిన ప్రభుత్వం సవరించిన నిబంధనల ప్రకారం,.. ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2028 మధ్య రిజిస్టర్ అయ్యే ఎలక్ట్రిక్ టూ-వీలర్లపై సబ్సిడీ ఇవ్వబడుతుంది. దీని కింద, బ్యాటరీ సామర్థ్యం ప్రతి కిలోవాట్-గంటకు (kWh) రూ.2,500 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. అయితే ఓ వాహనానికి గరిష్ట సబ్సిడీ పరిమితిని రూ.5,000గా నిర్ణయించారు. అలాగే, ఎక్స్-షోరూమ్ ధర రూ.1.5 లక్షల వరకు ఉన్న ఎలక్ట్రిక్ టూ-వీలర్లు మాత్రమే ఈ పథకం ప్రయోజనానికి అర్హత పొందుతాయి. సబ్సిడీ మొత్తం వాహనం ఎక్స్-షోరూమ్ ధరలో 15% లేదా రూ.5,000 (ఏది తక్కువైతే అది)కు పరిమితం చేయబడుతుంది. గతంలో, ఈ పథకం కింద సబ్సిడీ ఎక్కువగా ఉండేది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి kWhకు రూ.5,000 సబ్సిడీ ఉండేది. ఓ వాహనానికి గరిష్ట పరిమితి రూ.10,000గా ఉండేది. దీనిని ఏప్రిల్ 1, 2025 నుంచి తగ్గించడం జరిగింది.ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఈవీ తయారీని బలోపేతం చేయడం కోసం ప్రారంభించిన పీఎం ఇ-డ్రైవ్ పథకంలో ఈ మార్పులు చేశారు. సబ్సిడీ క్లెయిమ్‌లను సమర్పించడానికి చివరి గడువు డిసెంబర్ 31, 2027