ఈపీఎఫ్ఓలో 5 కీలక మార్పులు.. డబ్బులు మరింత వేగంగా విత్ డ్రా.. ఉద్యోగం మారినా టెన్షన్ లేదు
Actor ProfilePolitician

ఈపీఎఫ్ఓలో 5 కీలక మార్పులు.. డబ్బులు మరింత వేగంగా విత్ డ్రా.. ఉద్యోగం మారినా టెన్షన్ లేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈపీఎఫ్ఓలో 5 కీలక మార్పులు.. డబ్బులు మరింత వేగంగా విత్ డ్రా.. ఉద్యోగం మారినా టెన్షన్ లేదు
Samayam Telugu10 Dec 2026
ఈపీఎఫ్ఓలో 5 కీలక మార్పులు.. డబ్బులు మరింత వేగంగా విత్ డ్రా.. ఉద్యోగం మారినా టెన్షన్ లేదు

PF Withdrawal via UPI : ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రావిడెంట్ ఫండ్ (PF) గురించి తెలిసే ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప సామాజిక భద్రతా పథకం. ఇక్కడ ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది. ఇక్కడ ఉద్యోగి జీతం నుంచి 12 శాతం ప్రతి నెలా పీఎఫ్ అకౌంట్లో జమవుతుంది. ఇంకా కంపెనీ కూడా తన 12 శాతంలో 8 శాతానికిపైగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీంలో (EPS) వేస్తుంది. మరో 3 శాతానికిపైగా ఈపీఎఫ్ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఇక ఇది దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నిధిగా మారుతుంది. అయితే పీఎఫ్ డబ్బుల్ని నిర్వహించడం, ఉద్యోగం మారినప్పుడు పాత ఖాతాలోని మొత్తాన్ని కొత్త ఖాతాకు బదిలీ చేయడం, అవసరమైనప్పుడు క్లెయిమ్ చేసుకోవడం వంటి ప్రక్రియల్లో గతంలో కొంత ఇబ్బంది ఉండేది.అయితే ఇటీవలి ఈ సమస్యలపై ఈపీఎఫ్ఓ ప్రధానంగా దృష్టి సారించి సేవల్ని మెరుగుపరిచింది. సేవల్ని మరింత డిజిటల్‌గా, వేగంగా అందించే దిశగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కీలక మార్పులు తీసుకొచ్చింది. 2026లో ఉద్యోగులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఈ కీలక మార్పుల గురించి చూద్దాం.ఉమంగ్ యాప్ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్- యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ఉద్యోగి ఉద్యోగం మారినా ఈ నంబర్ మారదు. ప్రస్తుతం కొత్త యూఏఎన్‌ను జనరేట్ చేయడం, ఇప్పటికే ఉన్న యూఏఎన్‌ను యాక్టివేట్ చేయడం కోసం ఈపీఎఫ్ఓ సభ్యులు ఉమంగ్ యాప్‌లో ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ సదుపాయాన్ని ఉపయోగించవచ్చు. దీంతో ఉద్యోగులు యూఏఎన్‌కు సంబంధించిన పనుల కోసం గతంలో ఉన్న కొన్ని అదనపు దశల్ని తగ్గించుకోవచ్చు. Read Also: 10 ఏళ్లు ఉద్యోగం చేస్తే ఎంత పెన్షన్ వస్తుంది? కొత్త లెక్కలు, ఫార్ములా ఇదే..ఉద్యోగం మారితే పీఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్- ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి ఉద్యోగం మారినప్పుడు