ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ
Actor ProfilePolitician

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ
Sakshi26 Sept 2026
ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. తెలుగు ప్రేక్షకుల కోసమా అన్నట్లు డబ్బింగ్‌ల రూపంలోనూ స్ట్రీమింగ్ అవుతుంటాయి. రీసెంట్ టైంలో అలా 'సూపర్ సుబ్బు' సిరీస్ మన ఆడియెన్స్‌ని ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తోంది. దీనితో పాటు హాట్‌స్టార్‌లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన 'ప్రీతమ్ అండ్ పెడ్రో' అనే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సిరీస్ కూడా మెప్పిస్తోంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే?) కథేంటి? ప్రీతమ్(వీర్ హిరానీ) గోవాలో తాతతో కలిసి జీవిస్తుంటాడు. వాక్యూమ్ క్లీనర్స్ సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తుంటాడు. తన తాతకు ఎంతో ఇష్టమైన టేప్ రికార్డర్ ఎవరో దొంగిలించారని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఓ రోజు ప్రీతమ్ కంప్లైంట్ చేస్తాడు. అనుకోని పరిస్థితుల్లో అదే స్టేషన్‌కి చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీస్ అధికారి పెడ్రో(అర్షద్ వార్సి)కి ఓ ఏటీఎం దొంగతనం విషయంలో ఇతడు సాయం చేస్తాడు. మరోవైపు కేంద్ర మంత్రి కొడుకు కిడ్నాప్ కేసు పెడ్రో దగ్గరకు వస్తుంది. దీని విషయంలో తనకు కాస్త సాయం చేయాలని, అప్పుడే టేప్ రికార్డర్ వెతికి పెడతానని ప్రీతమ్‌కి పెడ్రో కండీషన్ పెడతాడు. ఇంతకీ మంత్రి కొడుకుని కిడ్నాప్ చేసింది ఎవరు? ప్రీతమ్ గతేమేంటి? గతంలో పెడ్రో కొడుకు చనిపోవడానికి కారణం ఎవరు? ఈ కథలో హ్యాకర్ మార్టిన్(విక్రాంత్ మస్సే) ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. ఎలా ఉందంటే? సినిమా అయినా సిరీస్ అయినా చూస్తున్నంతసేపు ఎంటర్‌టైన్ లేదా థ్రిల్ చేసిందా? అనేది కీలకం. అలాంటి వాటికే ఓటీటీలో మంచి రెస్పాన్స్ ఉంటుంది. 'ప్రీతమ్ అండ్ పెడ్రో' అలా పూర్తిస్థాయిలో ఆకట్టుకుంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దీనికి స్టోరీ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. సిరీస్ చూస్తున్నప్పుడు ఈయన గతంలో తీసిన మూవీస్ స్టైల్ అడుగడుగునా కనిపిస్తుంది. క్రైమ్ అనే పాయింట్‌కి