ఈ స్కూల్ లో 6 నుంచి ఇంటర్ వరకు చదువు ఉచితం.. హాస్టల్
Actor ProfilePolitician

ఈ స్కూల్ లో 6 నుంచి ఇంటర్ వరకు చదువు ఉచితం.. హాస్టల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈ స్కూల్ లో 6 నుంచి ఇంటర్ వరకు చదువు ఉచితం.. హాస్టల్, బుక్స్ ఫ్రీ.. వెంటనే దరఖాస్తు
Samayam Telugu14 Oct 2026
ఈ స్కూల్ లో 6 నుంచి ఇంటర్ వరకు చదువు ఉచితం.. హాస్టల్, బుక్స్ ఫ్రీ.. వెంటనే దరఖాస్తు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ముఖ్యగమనిక.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించే జవహర్‌ నవోదయ విద్యాలయ ాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాల కోసం జులై 31వ తేదీ వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దేశవ్యాప్తంగా మొత్తం 665 జవహర్‌ నవోదయ విద్యాలయాలు (జేఎన్‌వీ) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 15 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఈ మేరకు జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2027కు దరఖాస్తు చేసుకోవాలి. నవోదయ ప్రవేశ పరీక్షలో సీటు వచ్చిన విద్యార్థులు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)లో ఉచితంగా చదువుకోవచ్చు.నవోదయ విద్యాలయం ఉన్న జిల్లాలో నివాసం ఉండే విద్యార్థులు అర్హులు. 2026-27 విద్యా సంవత్సరంలో అదే జిల్లాల్లోని ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్‌లో ఐదో తరగతి చదువుతుండాలి. విద్యార్థులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే 3, 4, 5 తరగతులు చదివి ఉండాలి. నవోదయ విద్యాలయాల్లో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75శాతం సీట్లు కేటాయించారు.. మూడో వంతు సీట్లు బాలికలకు ఉంటాయి. కేంద్ర నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు రిజర్వేషన్లు ఉంటాయి. ఏపీలో మే 1, 2015 నుంచి జులై 31 2017 మధ్యలో పుట్టిన విద్యార్థులు అర్హులు. విద్యార్థులకు రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా సీటు కేటాయిస్తారు. పరీక్షలో 80 ప్రశ్నలు వంద మార్కులకు ఓఎంఆర్‌ పద్ధతిలో ఉంటాయి. ఈవీఎస్ అండ్ మెంటల్ ఎబిలిటి, మ్యాథ్స్, ల్యాంగ్వేజ్‌, అర్థమేటిక్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రవేశ పరీక్షకు 2 గంటల సమయం కేటాయిస్తారు.. దివ్యాంగ విద్యార్థులకు మరో 40 నిమిషాలు అదనంగా సమయం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో అర్హత ఉన్న విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయం అధికారిక వైబ్‌సైట్‌ అయిన ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థి ఫొటో, విద్యార్థి సంతకం, తల్లిదండ్రుల సంతకం, ఆధార్