ఈ వయసులో సిగ్గుచేటు.. వెళ్లి డబ్బు సంపాదించు.. ఉదయనిధికి త్రిష కౌంటర్.. వరుస పోస్టులు
Actor ProfilePolitician

ఈ వయసులో సిగ్గుచేటు.. వెళ్లి డబ్బు సంపాదించు.. ఉదయనిధికి త్రిష కౌంటర్.. వరుస పోస్టులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈ వయసులో సిగ్గుచేటు.. వెళ్లి డబ్బు సంపాదించు.. ఉదయనిధికి త్రిష కౌంటర్.. వరుస పోస్టులు
TV9 Telugu7 Dec 2026
ఈ వయసులో సిగ్గుచేటు.. వెళ్లి డబ్బు సంపాదించు.. ఉదయనిధికి త్రిష కౌంటర్.. వరుస పోస్టులు

ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే నేత, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. త్రిష పేరును ప్రస్తావించకుండానే పరోక్షంగా ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై టీవీకే నేతలు, సినీతారలు మండిపడ్డారు, సింగర్ చిన్మయి, సీనియర్ నటి ఖుష్బూ సైతం ఉదయనిధి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయనపై టీవీకే నేతలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఉదయనిధిని అరెస్ట్ చేయగా బెయిల్ పై విడుదలయ్యారు. ఈ వివాదం జరిగి దాదాపు వారం రోజులు అవుతుంది. తాజాగా ఈ కాంట్రవర్సీపై హీరోయిన్ త్రిష తనదైన స్టైల్లో కౌంటర్స్ ఇచ్చింది. ఈ మేరకు తన ఇన్ స్టాలో ఉదయనిధి పేరును ప్రస్తావించకుండానే గట్టిగానే ఇచ్చిపడేసింది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్ స్టాలో వరుస పోస్టులు చేసింది. తన అమ్మమ్మ 98వ పుట్టినరోజు వేడుకల నుండి కొన్ని మధురమైన క్షణాలను పంచుకున్నారు త్రిష. అలాగే తనదైన శైలీలో కౌంటర్స్ కూడా పోస్ట్ చేసింది. ఒక పోస్టులో "ఈ వయసులో ఇలాంటి నాటకీయతలు సిగ్గుచేటు. వెళ్లి కొంత డబ్బు సంపాదించి, ప్రశాంతతను కనుక్కో" అనే కోట్ షేర్ చేస్తూ దానికి కనుబొమ్మ ఎత్తిన ఎమోజీని జతచేసింది. అలాగే మరో పోస్టులో "మీరు చేసే ప్రతీదీ మీకే తిరిగి వస్తుంది. మంచి చేయండి, మంచిగా ఉండండి," అని ఉండగా, మూడవ పోస్టులో "ఇది మీకు అన్నీ చివరకు కలిసివచ్చే అధ్యాయం," అనే కోట్ పంచుకుంది. ఇక తర్వాత "సాహసం చేసేవారే గెలుస్తారు" , "ఒకే సమయంలో అది మిమ్మల్ని భయపెడుతూ, ఉత్తేజపరుస్తుంటే, బహుశా అదే మీ తదుపరి ఎత్తుగడ కావచ్చు", "మీకు ఏ లోటూ లేదు. నేను మీకు ఇచ్చినదాన్నే ఉపయోగించుకోండి" అంటూ వరుస పోస్టులు షేర్ చేసింది త్రిష. "ఒకప్పుడు మనం ప్రార్థించిన జీవితం మనకు లభించడం ఎంతటి అదృష్టమో" అని రాసి ఉన్న మరో పోస్ట్‌ను కూడా