
మరో వారం వచ్చేసింది. ఈసారి ఇండిపెండెన్స్ డే-వీకెండ్ కలిసొచ్చింది. దీంతో పలు తెలుగు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటిలో సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' స్పెషల్ అట్రాక్షన్ కాగా.. అగధ, పళ్లబురుసు, అనకాపల్లి లాంటి తెలుగు మూవీస్ అలానే విశాల్ 'మకుటం' అనే డబ్బింగ్ చిత్రం కూడా విడుదల కానుంది. వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ అయితే లేదు. (ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ) మరోవైపు ఓటీటీల్లో 22 వరకు సినిమాలు, సిరీస్ ఈ వారం స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో రష్మిక 'కాక్ టెయిల్ 2', భారతభాగ్య విధాత లాంటి హిందీ చిత్రాతో పాటు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే తెలుగు మూవీ కూడా ఉంది. ఉన్నంతలో ఇవే కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. వీకెండ్‌లో ఏమైనా సర్‌ప్రైజ్ స్ట్రీమింగ్‌లు ఉండొచ్చు. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలోకి రానుందంటే? ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 10 నుంచి 16 వరకు) హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 ఫినాలే (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10 108 బేస్ హాస్పిటల్: ఉరి (హిందీ సిరీస్) - ఆగస్టు 15 భారత భాగ్య విధాత (హిందీ మూవీ) - ఆగస్టు 14 మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు సినిమా) - ఆగస్టు 14 చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె-యూఎస్ఏ (తెలుగు కుకింగ్ షో) - ఆగస్టు 13 మిడ్ వింటర్ బ్రేక్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 10 రోరీ స్కోవెల్: షో మస్ట్ గో ఆన్ (ఇంగ్లీష్ షో) - ఆగస్టు 11 మౌరిన్హో (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 11 నాండో బిట్వీన్ టూ వరల్డ్స్ (బ్రెజిలియన్ సిరీస్) - ఆగస్టు 12 ఏ చైల్డ్ ఆఫ్ మై ఓన్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 13 డోంట్