ఈ ప్రాంతాల్లో అల్ల క ల్లోల మే.. ఉరుములు
Actor ProfilePolitician

ఈ ప్రాంతాల్లో అల్ల క ల్లోల మే.. ఉరుములు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈ ప్రాంతాల్లో అల్ల క ల్లోల మే.. ఉరుములు, మెరుపుల తో కూడిన భారీ వ ర్షాలు
Asianet News Telugu12 Jan 2027
ఈ ప్రాంతాల్లో అల్ల క ల్లోల మే.. ఉరుములు, మెరుపుల తో కూడిన భారీ వ ర్షాలు

తెలంగాణలో ఆగస్టు 20 వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ప్రత్యేక అప్రమత్తత అవసరం అని అధికారులు సూచించారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీన నిర్మాణాలకు సమీపంలో ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆగస్టు 20 నుంచి 25 వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు కొనసాగనున్నాయి. అయితే ఈ వ్యవధిలో ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. అంటే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల పరిస్థితి ఉంటుందని చెప్పలేము. ప్రాంతాన్ని బట్టి వర్షాల తీవ్రత మారే అవకాశం ఉంది. కొన్ని చోట్ల సాధారణ జల్లులు ప‌డ‌నుండ‌గా, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. ప్ర‌త్యేకంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వాతావరణ మార్పులను గమనిస్తూ స్థానిక అధికారులు ఇచ్చే సూచనలను పాటించడం మంచిది. ఆంధ్రప్రదేశ్‌లోనూ రాబోయే రోజుల్లో వర్షాలు కొనసాగనున్నాయి. ఆగస్టు 18 రాత్రి నుంచి 20 ఉదయం వరకు ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదే సమయంలో గంటకు 40