ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న బంగారంతో ఆదాయం.. సరికొత్తగా ఆ గోల్డ్ స్కీమ్
Actor ProfilePolitician

ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న బంగారంతో ఆదాయం.. సరికొత్తగా ఆ గోల్డ్ స్కీమ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న బంగారంతో ఆదాయం.. సరికొత్తగా ఆ గోల్డ్ స్కీమ్
Oneindia Telugu11 Jan 2027
ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న బంగారంతో ఆదాయం.. సరికొత్తగా ఆ గోల్డ్ స్కీమ్

బంగారం ఇష్టపడని వారు ఉండరు. అలాగే బంగారం కొనుగోలు చేసిందంతా మనం ఉపయోగించం. అలా నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌ను మార్పులు చేసి త్వరలో అమలు చేయనుంది. దేశవ్యాప్తంగా ఇళ్లల్లో సుమారు 30,000 టన్నుల బంగారం లాకర్లు, బ్యాంకు లాకర్లలోనే ఉండిపోయిందని అంచనా.గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో గత పదేళ్లలో కేవలం 39టన్నుల బంగారం మాత్రమేఈ భారీ సంపదను వినియోగంలోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశంగా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ను మార్పులు చేసి తీసుకొస్తుంది కేంద్రం . 2015లో మొదటిసారి ప్రవేశపెట్టిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటం కారణంగా ఆ స్కీం లో మార్పులు చేస్తున్నారు. గత పదేళ్లలో కేవలం 39 టన్నుల బంగారం మాత్రమే సేకరించగలిగారు.నిబంధనలను మార్పు చేసి కేంద్రం సరికొత్త విధానంకఠినమైన బ్యాంకింగ్ నిబంధనలు, బంగారాన్ని కరిగించడంపై ప్రజల్లో ఉన్న సెంటిమెంట్, ప్యూరిటీ టెస్టింగ్ సెంటర్ల కొరత, అవగాహన లోపం వంటివి ప్రధాన కారణాలు. ఈ లోపాలను సరిదిద్దుతూ కేంద్రం ఇప్పుడు సరికొత్త విధానాన్ని తీసుకొస్తోంది. కొత్త పథకంలో అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. జువెలర్లను అగ్రిగేటర్లుగా నియమించడం. ఇకపై ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరంలేకుండా, తాము నమ్మే స్థానిక బంగారు వ్యాపారి వద్దకే వెళ్లి బంగారాన్ని డిపాజిట్ చేయవచ్చు.జువెలర్లకు కొత్త వ్యాపార అవకాశాలుజువెలర్లు కస్టమర్ల నుంచి బంగారాన్ని సేకరించి, ప్యూరిటీ పరీక్షించి, ఒకచోట చేర్చే బాధ్యత తీసుకుంటారు. దీని వల్ల ప్రజలకు సౌకర్యం పెరుగుతుంది, జువెలర్లకు కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. డిపాజిట్ చేసిన బంగారానికి ప్రభుత్వం వార్షిక వడ్డీ అందిస్తుంది. గడువు ముగిసిన తర్వాత అదే బరువు గల స్వచ్ఛమైన బంగారం లేదా అప్పటి మార్కెట్ ధర ప్రకారం నగదు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.మంచిర్యాల–వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేపై లేటెస్ట్ అప్డేట్!