ఇరుముడి’.. శబరిమలతో సంబంధం లేదు
Actor ProfileActor

ఇరుముడి’.. శబరిమలతో సంబంధం లేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరుముడి’.. శబరిమలతో సంబంధం లేదు
Eenadu30 Nov 2026
ఇరుముడి’.. శబరిమలతో సంబంధం లేదు

ఇంటర్నెట్‌ డెస్క్‌: రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ డివోషనల్ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పాటల్లో, టీజర్‌లో రవితేజ (Ravi Teja) అయ్యప్ప మాలలో కనిపించారు. దీంతో ఈ చిత్ర కథపై సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. శబరిమల బ్యాక్‌డ్రాప్‌లో ఇది రానుందని ప్రచారం మొదలైంది. తాజాగా దీనిపై దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. శబరిమల దేవాలయానికి ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘‘ఈ కథకు (Irumudi) శబరిమలతో ఎలాంటి సంబంధం లేదు. సినిమాలో కథానాయకుడి జీవితంలో 41 రోజుల అయ్యప్ప దీక్ష ఒక భాగం మాత్రమే. దీక్షా కాలంలో అయ్యప్ప భక్తులు తమ నియమావళి, అలవాట్ల విషయంలో చాలా నిష్టగా ఉంటారు. వ్యసనాలు ఉన్న ఒక వ్యక్తి ఈ దీక్ష తీసుకోవాల్సి వస్తే.. అతడు మద్యానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అక్కడే కథలో అసలైన సంఘర్షణ మొదలవుతుంది. కఠినమైన నియమాలు ఉండాలి కాబట్టే నేను అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యాన్ని ఎంచుకున్నాను. అంతే తప్ప ఇది శబరిమలకు సంబంధించిన కథ కాదు’’ అని ఆయన పేర్కొన్నారు (Irumudi Story). ‘‘ఈ 41 రోజుల కథే స్క్రీన్‌ప్లేకి ప్రధాన బలంగా నిలుస్తుంది. అది సినిమాను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. ఆ దీక్షకు ముందు ఏం జరిగింది.. దీక్షలో ఉన్న సమయంలో ఏం జరిగిందనే విషయాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి’’ అని శివ నిర్వాణ తెలిపారు. రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్‌ నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది (Irumudi Release Date). గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల