ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్
Actor ProfileActor

ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్
123Telugu5 Dec 2026
ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తుండగా ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. కాగా, ఈ చిత్ర ట్రైలర్‌ను ఆగస్టు 12న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. అయితే, ఈ ట్రైలర్ ఏ సమయానికి రానుందనే విషయంపై చిత్ర యూనిట్ తాజాగా అప్‌డేట్ ఇచ్చేసింది. ఆగస్టు 12న సాయంత్రం 6 గంటల 03 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇక ఈ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తుండగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. సాయి కుమార్, బేబీ నక్షత్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది