ఇరుముడి’ ఒక ఎమోషనల్ రైడ్.. డిఫరెంట్ రవితేజను చూస్తారు
Actor ProfileActor

ఇరుముడి’ ఒక ఎమోషనల్ రైడ్.. డిఫరెంట్ రవితేజను చూస్తారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరుముడి’ ఒక ఎమోషనల్ రైడ్.. డిఫరెంట్ రవితేజను చూస్తారు
Chitrajyothy2 Jan 2027
ఇరుముడి’ ఒక ఎమోషనల్ రైడ్.. డిఫరెంట్ రవితేజను చూస్తారు

‘ఇరుముడి’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఇది ఒక మంచి ఎమోషనల్ రైడ్. ఒక విషయం మాత్రం బల్లగుద్ది చెబుతున్నాను.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది. ప్రేక్షకులందరూ థియేటర్లలో ఒక మంచి సినిమాను ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు. ‘ఇరుముడి’ (Irumudi) నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఇది ఒక మంచి ఎమోషనల్ రైడ్. ఒక విషయం మాత్రం బల్లగుద్ది చెబుతున్నాను.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది. ప్రేక్షకులందరూ థియేటర్లలో ఒక మంచి సినిమాను ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఇందులో మీరు ఇప్పటివరకు చూడని ఒక డిఫరెంట్ రవితేజను చూస్తారు. నా పాత్ర, కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కచ్చితంగా కనెక్ట్ చేస్తాయని నమ్ముతున్నాను' అని రవితేజ (Ravi Teja) అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ఆగస్టు 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో హుషారుగా సాగే ' మల్లెపూల పల్లకి' సాంగ్ ను విడుదల చేశారు. రవితేజ మాట్లాడుతూ 'ఈ సినిమా ఒక మంచి ఎమోషనల్ రైడ్. నేను చెప్పడం కంటే సినిమా చూసిన తర్వాత మీరే చెబుతారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు. ప్రతి క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. స్వాసిక నటన చూస్తే మీకు భయమేస్తుంది. అంత అద్భుతంగా చేసింది. కొన్ని క్యారెక్టర్స్ మీ మైండ్‌లో ఉండిపోతాయి. సినిమా చూసాక మీకే అర్థమవుతుంది. ఇందులో ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సాయికుమార్గాను కొత్తగా చూస్తారు. సినిమా గురించి చాలా మాట్లాడుకుంటారు. జీవీ ప్రకాష్ బ్రహ్మాండమైన పాటలు ఇచ్చారు. నక్షత్ర ఫ్యూచర్‌లో చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ మిమ్మల్ని టచ్ చేస్తాయి. సినిమాలో మీకు ప్రియా భవానీ శంకర్ కనిపించదు.. కేవలం కావేరి పాత్ర మాత్రమే కనిపిస్తుంది