
ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నేత (సుప్రీం లీడర్) ముజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై నెలకొన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, పరిస్థితి విషమంగా ఉందని ఇజ్రాయెల్, అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను ఖండించేందుకు ఇరాన్ ప్రయత్నించింది. ఇందులో భాగంగా, ఆయన ఆరోగ్యంగా ఉన్నారంటూ ప్రభుత్వ అనుబంధ 'మెహర్ న్యూస్ ఏజెన్సీ' శనివారం రాత్రి ఒక వీడియోను విడుదల చేసింది. అయితే, ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే దానిపై తేదీ లేకపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు మరింత బలపడ్డాయి.కొన్ని రోజులుగా ముజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. ఆయనను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఇజ్రాయెల్ ‘ఛానల్ 14’ శుక్రవారం కథనాలు ప్రసారం చేసింది. ఇరాన్ అధ్యక్ష వర్గాల్లోనే ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోందని, "ఆయన వీరమరణం పొందారనే వార్త విన్నా మేం ఆశ్చర్యపోనక్కర్లేదు" అని ఒక అధికారి వ్యాఖ్యానించినట్లు 'జెరూసలెం పోస్ట్' పేర్కొంది.ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే మెహర్ న్యూస్ ఏజెన్సీ 12 సెకన్ల నిడివి గల వీడియోను బయటపెట్టింది. అందులో ముజ్తాబా ఖమేనీ ప్రశాంతంగా కూర్చుని కొందరితో మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నారు. అయితే, ఈ వీడియో సందేహాలను నివృత్తి చేయకపోగా, కొత్త ప్రశ్నలకు తావిచ్చింది. ఇది యుద్ధం ప్రారంభం కావడానికి ముందు 'కోమ్' నగరంలో ఆయన ప్రసంగించినప్పటి పాత వీడియో అని అంతర్జాతీయ నిపుణులు, సోషల్ మీడియా వేదికగా పలువురు ఆరోపిస్తున్నారు.తన తండ్రి మరణానంతరం సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముజ్తబా ఒక్కసారి కూడా ప్రజల ముందుకు ప్రత్యక్షంగా రాలేదు. ఇటీవల