
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు చేస్తూ.. మరోవైపు చర్చలకు తలుపులు తెరిచి ఉంచుతున్న ఆయన తీరు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. “ఇది యుద్ధం కాదు.. చెస్ గేమ్ లాంటిది” అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయన వ్యూహానికి అద్దం పడుతున్నాయి. సైనిక చర్యల కంటే ముందుగా ఆర్థిక ఒత్తిడి, ఆంక్షలు, దౌత్యపరమైన ఎత్తుగడలతో ఇరాన్‌ను చర్చల బాట పట్టించాలన్నది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. ఇరాన్‌తో అమెరికా ప్రస్తుతం “పాక్షిక చర్చలు మాత్రమే” జరుపుతోందని ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు. “ఇరాన్‌లో భారీ ద్రవ్యోల్బణం ఉంది. వారి వద్ద డబ్బు లేదు. మేం పరిస్థితిని గమనిస్తున్నాం” అని ట్రంప్ పేర్కొన్నట్లు అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్ తెలిపింది. వెంటనే మరో సైనిక చర్యకు దిగకుండా.. ఇరాన్ ఆర్థిక పరిస్థితిని మరింత ఒత్తిడికి గురిచేసే విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఇటీవల ఇరాన్‌పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ట్రంప్.. ఇప్పుడు మాట మార్చడం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం వల్ల అమెరికాపై పడే ఆర్థిక, రాజకీయ ప్రభావాలను అంచనా వేసుకుంటూనే.. ఒత్తిడి ద్వారా ఫలితం సాధించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి దాడుల మాట.. మరోసారి చర్చల బాట! ట్రంప్ విదేశాంగ విధానంలో ఈ మార్పు కొత్తది కాదు. ప్రత్యర్థి దేశాలపై గరిష్ఠ ఒత్తిడి తీసుకురావడం.. ఆ తర్వాత చర్చలకు మార్గం సుగమం చేయడం ఆయన శైలిలో కనిపించే అంశం. ఇరాన్ విషయంలోనూ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు సైనిక శక్తిని ప్రదర్శిస్తూ హెచ్చరికలు చేయడం.. మరోవైపు చర్చలకు అవకాశం ఉందని చెప్పడం ద్వారా టెహ్రాన్‌పై మానసిక ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతోందని అంచనాలు ఉన్నాయి. “ఇది చెస్ ఆట లాంటిది. చివరకు అంతా సర్దుకుంటుంది” అని