ఇరాన్ కు మమ్మల్ని బలిచేస్తారా
Actor ProfilePolitician

ఇరాన్ కు మమ్మల్ని బలిచేస్తారా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరాన్ కు మమ్మల్ని బలిచేస్తారా
Eenadu7 Dec 2026
ఇరాన్ కు మమ్మల్ని బలిచేస్తారా

ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమాసియా ఘర్షణలు, ఇరాన్ బెదిరింపుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎయిర్‌ఫోర్స్‌వన్‌ను వదిలి మరో చిన్నవిమానంలో ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఈ సీక్రెట్ ఫ్లైట్‌ను తాజాగా ట్రంప్ (Donald Trump) ధ్రువీకరించారు. మరోవైపు పాత్రికేయుల్ని, ఇతర సిబ్బందిని వదిలేసి.. భద్రతా సిబ్బంది అధ్యక్షుడిని ఒక్కరినే తరలించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మమ్మల్ని ఇరాన్‌కు బలిచేస్తారా..? అంటూ పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జులైలో తుర్కియే రాజధాని అంకారాలో నాటో సదస్సు జరిగింది. ఖతార్ కానుకగా ఇచ్చిన బోయింగ్ 747-8లో అంకారాకు ట్రంప్ (Donald Trump) వెళ్లారు. కానీ వచ్చేటప్పుడు.. పాత ఎయిర్‌పోర్స్‌ వన్‌ ఎక్కినట్లు ప్రపంచానికి చూపించారు. కానీ భద్రతా సిబ్బంది ఆయన్ను క్యాటరింగ్ ట్రక్కులో తరలించి, చిన్నవిమానంలో తుర్కియే దాటించారు. దీనిపై ట్రంప్ మాట్లాడారు. ‘‘సీక్రెట్ సర్వీస్, సైన్యం నా భద్రతను నిర్ణయిస్తుంది. వారు నన్ను వేరే విమానంలో వెళ్లమన్నారు. వారు చెప్పినట్లే జరిగింది. నాకు ఏదో ముప్పు ఉండిఉండొచ్చు. కానీ ఆ విషయం గురించి నేను పెద్దగా మాట్లాడలేదు. ఇలాంటి బెదిరింపులు చాలా వస్తుంటాయి’’ అని ట్రంప్ పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు