ఇరాన్ ఆటలు సాగవు.. హర్మూజ్ మా నియంత్రణలోనే
Actor ProfilePolitician

ఇరాన్ ఆటలు సాగవు.. హర్మూజ్ మా నియంత్రణలోనే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరాన్ ఆటలు సాగవు.. హర్మూజ్ మా నియంత్రణలోనే
Eenadu20 Oct 2026
ఇరాన్ ఆటలు సాగవు.. హర్మూజ్ మా నియంత్రణలోనే

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాతో ఉద్రిక్తతల వేళ హర్మూజ్‌ జలసంధిలో నౌకల రవాణా మార్గానికి సంబంధించి ఇరాన్‌ చేసిన ప్రకటనను అగ్రరాజ్యం ఖండించింది. హర్మూజ్‌ (Strait of Hormuz) పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేసింది. ఈ జలమార్గం మీదుగా 800 నౌకలు సురక్షితంగా ప్రయాణించినట్లు తెలిపింది. ఈ మేరకు యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. అసలేం జరిగిందటే.. హర్మూజ్‌ జలసంధి మీదుగా నౌకలు రాకపోకలు సాగించాలంటే తాము నిర్దేశించిన మార్గాల్లోనే అవి ప్రయాణించాలని ఇరాన్‌ (Iran) ప్రకటించినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ జలసంధి కార్యకలాపాల్లో అమెరికా జోక్యాన్ని తాము అనుమతించబోమని టెహ్రాన్‌ పేర్కొంది. దీనిపై యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ స్పందించింది. ‘‘ఇరాన్‌ మీడియా చేసిన ప్రకటనలో నిజం లేదు. వాస్తవానికి హర్మూజ్‌పై ఇరాన్‌కు ఎలాంటి నియంత్రణ లేదు. ఈ ఏడాది మే నుంచి ఈ జల మార్గంలో 800 వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా అమెరికా దళాలు భద్రత కల్పించాయి. వీటిల్లో 380 మిలియన్‌ బ్యారెళ్ల ముడిచమురు రవాణా అయ్యింది’’ అని అమెరికా స్పష్టం చేసింది. ఇటీవల ఒమన్‌ కారిడార్‌ నుంచి ప్రయాణిస్తున్న కొన్ని నౌకలను ఇరాన్‌ వెనక్కి పంపించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాము నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణించాలని టెహ్రాన్‌ వాటిని ఆదేశించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం స్పందించింది. ఇదిలా ఉండగా.. అమెరికా-ఇరాన్‌ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ హర్మూజ్‌ మీదుగా వాణిజ్య నౌకల ప్రయాణం యధావిధిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఐదు ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్లు ఈ జలమార్గంలోకి ప్రవేశించినట్లు కెప్లర్‌ షిప్‌ ట్రాకింగ్‌ డేటా వెల్లించింది. వీటిల్లో ఒకటి గ్రీక్‌ షిప్పింగ్‌ కంపెనీది కాగా.. మిగతా నాలుగు ఖతార్‌తో సంబంధం ఉన్న నౌకలుగా తెలుస్తోంది. మరోవైపు, జులై 7-9 మధ్య తమ దేశానికి చెందిన 22 నౌకలు హర్మూజ్‌ మీదుగా ప్రయాణించినట్లు