
ఇంటర్నెట్ డెస్క్: యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh).. యువరాజ్ సింగ్ తండ్రిగానే కాకుండా కోచ్‌గానూ సుపరిచితుడే. క్రికెటర్ దిగ్గజం కపిల్ దేవ్‌తో కలిసి దేశవాళీలోనూ ఆడిన మాజీ క్రికెటర్ కూడా. కానీ, కపిల్‌తోపాటు ఎంఎస్ ధోనిపై విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. యోగ్‌రాజ్ తరఫున యువరాజ్ గతంలో మాజీ కెప్టెన్లకు క్షమాపణలు కూడా చెప్పాడు. ఈ క్రమంలో తనపై యోగ్‌రాజ్ చేసిన విమర్శలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ స్పందించారు. అతడు తనకు ఇప్పటికీ స్నేహితుడేనని.. కాకపోతే అలాంటి వ్యక్తులను కలిసేందుకు ఇష్టపడనని వ్యాఖ్యానించారు. ‘‘యోగ్‌రాజ్ సింగ్‌కు బదులు యువరాజ్ సింగ్ క్షమాపణలు చెప్పాడు. అలా చెప్పాల్సిన అవసరం అతడికి లేదు. అయినా ఇదంతా జరిగిపోయిన విషయం. యువీ గొప్ప క్రికెటర్. దేశానికి అతడు అందించిన సేవలను ఎప్పటికీ మరిచిపోలేం. ఆట మరింత పాపులర్ కావడంలో యువీ (Yuvraj Singh) కూడా ముఖ్య భూమిక పోషించాడు. ఇప్పటికీ అభిమానులు అతడిని ప్రేమిస్తారు’’ అని యువీపై కపిల్ (Kapil Dev) ప్రశంసల వర్షం కురిపించారు. స్నేహితుడిగా మాత్రమే కపిల్‌ను హగ్ చేసుకుంటానని గతంలో యోగ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఈ క్రికెట్ దిగ్గజం స్పందించారు. ‘‘అసలు అతడేం చెప్పాలనుకుంటున్నాడో తెలియడం లేదు. ఇప్పటికీ నాకు అతడు స్నేహితుడే. నా వైపు నుంచి ఎలాంటి సమస్యా లేదు. కానీ, ఇలాంటి వ్యక్తులను కలిసేందుకు నేను ఇష్టపడను. సంతోషంగా ఉండేవారినే కలుస్తా. ఇలాంటి వ్యక్తులను ఎవరూ ప్రేమించరు. ఎవరికీ ఏదీ తేలిగ్గా రాదు. కొన్నిసార్లు మనకు వస్తుంది. మరికొన్నిసార్లు మన కుటుంబ సభ్యులకు అవకాశం దక్కుతుంది. దానితో సంతృప్తి పడాలి. అతడి కుమారుడు అద్భుతాలు చేశాడు. నేను కూడా అతడిలాగే అసభ్యంగా మాట్లాడితే పరిస్థితి ఏంటి? జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను చూశాం. చాలా మంది భారత జట్టులో ఆడాలని కోరుకుంటారు. అలాగే సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ఎదురు చూస్తుంటారు. మిగతా వారితో పోలిస్తే నీకు (యోగ్‌రాజ్)