ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఆమె నా ఫేవరెట్.. మిగిలిన వారికి యాటిట్యూడ్ ఎక్కువ
Actor ProfileActor

ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఆమె నా ఫేవరెట్.. మిగిలిన వారికి యాటిట్యూడ్ ఎక్కువ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఆమె నా ఫేవరెట్.. మిగిలిన వారికి యాటిట్యూడ్ ఎక్కువ
TV9 Telugu24 Oct 2026
ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఆమె నా ఫేవరెట్.. మిగిలిన వారికి యాటిట్యూడ్ ఎక్కువ

ఒకప్పుడు అందం, నటనతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మల్లో రంభ ఒకరు. అప్పట్లో ఈ అమ్మడు ఓ ఊపు ఊపేసింది. ఈ బ్యూటీ కోసం కుర్రాళ్ళు థియేటర్స్ ముందు క్యూ కట్టేవారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. అప్పట్లో ఉన్న స్టార్ హీరోయిన్స్ కు పోటీగా రంభ రాణించింది. చిన్న చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోలు, సీనియర్ హీరోల వరకు అందరి సరసన నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు తెలుగులోనే కాదు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. హీరోయిన్ గా సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. అడపాదడపా స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిసింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లాంటి హీరోలతో స్పెషల్ సాంగ్స్ చేసి అదరగొట్టింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది రంభ. పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనించి హ్యాపీ లైఫ్ గడుపుతుంది. ఇదిలా ఉంటే గతంలో రంభ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తనకు రమ్యకృష్ణ అంటే చాలా భయం అని చెప్పింది రంభ. అలాగే సౌందర్య గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో తనకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారంటే అది సౌందర్య అని తెలిపింది రంభ. సౌందర్య నేను చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం.. ఆమె అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది రంభ. అలాగే నటి మహేశ్వరీ కూడా తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పింది. ఇక హీరోయిన్స్ లో తనకు ఎవరితో కలిసి నటించడం కష్టంగా అనిపించింది.? అనే ప్రశ్నకు అంటే రమ్యకృష్ణ పేరు